మరికొద్ది రోజులలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పార్టీలు ప్రచారంలో చాలా బిజీ బిజీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత వేడి చేస్తున్నారు. మొదటి నుండి వస్తున్న సర్వేల ఫలితాలను బట్టి చూస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా అనేక సర్వేల ఫలితాల ద్వారా అర్థమవుతుంది.
Image result for bjp
ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ త్వరలో బెంగుళూరు వేదికగా ఓ భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. మరిముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవికి  తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Related image
మరియు అదేవిధంగా బీజేపీ కూడా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళుతోంది..ఈ క్రమంలో కర్ణాటక ప్రజలకు బిజెపి అధికారంలోకి వస్తే మహానగరమైన బెంగళూరు ని మరింత శోభిల్లే నగరంగా తీర్చిదిద్దుతామని కర్ణాటక బిజెపి నాయకులు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అవినీతి మాయం చేసిందని...ఈ క్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతికి తెగబడి భయంకరంగా సంపాదించుకున్నారని ఆరోపించారు.
Image result for somu veerraju
అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కర్ణాటక లో బిజెపి గెలుపు ఖాయమని, అక్కడి ప్రజలు తమగెలుపుని ఎప్పుడో నిర్ణయించారని అన్నారు. మోడీ పాలనలో దేశం ఇప్పటికే సుభిక్షంగా ఉందని, అలంటి నేత పాలన మా రాష్ట్రంలో కూడా కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: