సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రజాక్షేత్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. రోజుకో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. మెరుగైన సమాజం కోసమే తాను ఐపీఎస్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకూ ఆయన ఉద్దేశమేంటి? రాజకీయాలా..? సమాజ సేవా..?

Image result for jd lakshmi narayana

          సీబీఐ జేడీగా లక్ష్మినారాయణ ఓ సంచలనం. ఎన్నో సంచలనాత్మకమైన కేసులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన ఘనత ఆయనది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన హవా ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన మాటలకోసం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తి కలిగిస్తాయి. అందుకే ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణకు కూడా ఇలాంటి క్రేజే ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లక్ష్మినారాయణ భర్తీ చేస్తున్నారు.

Image result for jd lakshmi narayana

          ప్రజల్లో ఉన్నారు.. ప్రజలతో తిరుగుతున్నారు సరే.. ఇంతకూ ఆయన ఏం చేయబోతున్నారనేది ఇంతవరకూ క్లారిటీ లేదు. రాజకీయాల్లోకి వస్తారని కొందరు ప్రచారం చేస్తుంటే మరికొందరు మాత్రం ఆయనకు అలాంటి ఉద్దేశం లేదంటున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని సన్మార్గంలో నడిపించడానికి, మెరుగైన సమాజాన్ని నెలకొల్పడానికి ఆయన కృషి చేస్తారనేది కొందరి మాట. అయితే లక్ష్మినారాయణ మాత్రం రెండు మూడు నెలల తర్వాతే తన తదుపరి కార్యాచరణ ఏంటో ప్రకటిస్తానని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైతే ప్రజాసమస్యలపై అధ్యయనం కోసమే సమయం కేటాయించనున్నట్టు వెల్లడించారు.

Image result for jd lakshmi narayana

          కొంతకాలం పాటు ప్రజాసమస్యలపై అధ్యయనం చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారనేది చాలా మంది చెప్తున్న మాట. అయితే ఆయన ఏదైనా పార్టీలో చేరతారా.. లేకుంటే సొంత పార్టీ పెడతారా అనేదానిపైన కూడా క్లారిటీ లేదు. కానీ ఆయన బీజేపీలో చేరబోతున్నారని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తిరిగి కాస్త అవగాహన తెచ్చుకున్న తర్వాత బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం. లక్ష్మినారాయణ కోసమే బీజేపీ తన అధ్యక్ష పదవిని ఇంతవరకూ భర్తీ చేయకుండా ఆపుతోందనే సమాచారం కూడా ఉంది. ఆయన పార్టీలో చేరగానే పార్టీ పగ్గాలను ఆయన చేతిలో పెట్టనుందనే వార్త బీజేపీ ఆంతరంగిక సమాచారం.

Image result for jd lakshmi narayana

          అయితే.. లక్ష్మినారాయణ జనసేనలో చేరితే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. పవన్, లక్ష్మినారాయణ ఇద్దరూ స్వచ్ఛమైన సమాజం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారిద్దరూ కలిస్తే మంచి ఫలితాలుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దుందుడుకు స్వభావం కలిగిన పవన్ కల్యాణ్ తో కలిసి పని చేసేందుకు లక్ష్మినారాయణ సిద్ధంగా లేరని సమాచారం. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: