ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పరిపాలించడమనే బాధ్యతనే క్లిష్టతరమయితే, పార్టీలో నేతలు చేస్తున్న రభస ఆయనకు కొత్త తలనొప్పులు తెస్తుంది. ఇప్పటికే ఆళ్లగడ్డ వర్గపోరుకు సంబంధించి వైవిసుబ్బారెడ్డి, మంత్రి అఖిల ప్రియకు వార్నింగ్ ఇచ్చిన ఆయన తాజాగా ఫిరాయించి మంత్రి పదవి సాధించిన ఎమ్మెల్యేకి కూడా క్లాస్ పీకే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇదంతా ఒకెత్తయితే ఓటుకు నోటు కేసుకు సంబంధించి మళ్ళీ కూపీలాగాటం బాబుకు కొత్త ఇబ్బందులు తెస్తుంది. గతంలో జరిగిన ముఖ్యమైన కేసులన్నింటినీ క్లియర్ చేయాలనీ, ఆ కేసులకు సంబందించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని  తెలంగాణా సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారని సమాచారం. ఆవిధంగానే చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు కూడా బయటపడుతుందని పలువురు భావిస్తున్నారు.


ఇక బీజేపీ నేతలు మాత్రం ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని కేసీఆర్ కు విన్నవిస్తూ ఇప్పటికే పార్టీ నేతల ఆగడాలతో సతమతమవుతున్న బాబు పుండుమీద కారం జల్లుతున్నారు. ఆ కేసులో వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి తెలంగాణా ప్రభుత్వానికి విన్నవించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: