మోడీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పార్లమెంట్ లో చీకటి గదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీ పాలకులు. అయితే రాష్ట్రం విడగొట్టిన సందర్భంలో పార్లమెంటు సాక్షిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు హామీలు ఇవ్వడం జరిగింది... ఇదే విషయాన్ని విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది.
Image result for modi
అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడంతో... నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఎన్నికల ప్రచారంలో మోడీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది...అంతేకాకుండా భారత దేశ రాజధాని ఢిల్లీ అసూయపడేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే మోడీ ప్రధాని అయి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా..విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
Related image
ఎంతో ముఖ్యమైన హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలో మోడి ఆంధ్రరాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు. మోడీ… రాజ్యాంగపరంగా అమలు చేయాల్సిన విభజన చట్టం అమలుకు కూడా నిరాకరిస్తున్నారు. ఈ నేపద్యంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కావడంలేదంటూ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
Image result for modi
జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. వ్యాజ్యానికి సంబంధించిన వివరాలు తెప్పించుకునేందుకు సమయం కావాలని కేంద్రం కోరింది. దానిపై ధర్మాసనం స్పందిస్తూ, నాలుగు వారాల గడువు ఇవ్వడంతోపాటు, హామీల అమలుపై వివరాలివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: