ఏ రాష్రం లో అయినా ప్రభుత్వం ప్రజలు డబ్బులకు భాద్యత వహించాలి. ప్రతి రూపాయి చాలా జాగ్రత్త గా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఖర్చు పెట్టె ప్రతి రూపాయి ప్రజల సొమ్ము కాబట్టి అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి ప్రజలు డబ్బులను దుబారా చేస్తున్నాడని ఎప్పటి నుంచే వినిపిస్తున్న మాటలు. పైగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగినా చెప్పడానికి తిరస్కరిస్తున్నారు.

Image result for chandrababu naidu

గత నాలుగేళ్లలో చంద్రబాబు ఎక్కువ కాలం విదేశాలకు తిరగడంలోనే గడిపారు. వందల కోట్లు విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేశారు. ఎంత ఖర్చు చేశారని అడిగితే చెప్పేది లేదని అధికారులు తెగేసి చెప్పారు. ఏపీలో ఓ సమాచార హక్కు కార్యకర్త విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అన్ని రకాల ఖర్చుల వివరాలు తెలియచేయాలని ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేశాడు.

Image result for chandrababu naidu

ఆర్‌టీఐ దరఖాస్తుకు అసిస్టెంట్‌ సెక్రటరీ (ప్రొటోకాల్‌), సాధారణ పరిపాలన శాఖలోని పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సమాధానమిస్తూ ఆర్‌టీఐలోని ఫలాన సెక్షన్‌ ప్రకారం మీకు సమాధానం ఇవ్వడం కుదరదని జవాబు ఇచ్చారు. దీంతో దరఖాస్తూదారు పై అధికారులకు విజ్ఞప్తి చేశాడు. వారూ అదే సమాధానమిచ్చి ఓ ప్రభుత్వ వెబ్‌సైట్‌ గురించి చెప్పి, వివరాలకు అది చూసుకోండన్నారు. అది చూస్తే బుర్ర తిరిగిపోవడం తప్ప సమాచారం దొరకదు. తాను నిప్పునని, నిజాయితీపరుడినని  ఊదరగొట్టే చంద్రబాబు విదేశీ ప్రయాణాలకైన ఖర్చును ప్రజలకు పారదర్శకంగా ఎందుకు తెలియచేయరు?


మరింత సమాచారం తెలుసుకోండి: