కృష్ణా జిల్లాలో టిడిపి నేత‌ల‌ను ఆక‌ర్షించ‌టంలో వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహం ఫ‌లిస్తున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి సీనియ‌ర్ నేత వ‌సంత కృష్ణ ప్రసాద్ గురువారం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి కందువా క‌ప్పుకోనున్నారు. కైక‌లూరులో జ‌గ‌న్-వసంత‌ల భేటీ జ‌రుగుతోంది. రాజ‌ధాని జిల్లాలైన కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవాలంటే క‌చ్చితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నేత‌ల మ‌ద్ద‌తు లేకుండా సాధ్యం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. జ‌నాభా రీత్యా క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి పై చేయి కాక‌పోయినా ద‌శాబ్దాల రాజ‌కీయ అధికారం మాత్రం పై సామాజిక‌వ‌ర్గం చేతుల్లోనే ఉండ‌టంతో వారి ప్రాబ‌ల్యానికి ఎదురులేకుండా ఉంది. ఇది ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం కాదు. ఆ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించ‌టంతోనే క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌ల‌ను ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

Image result for jagan padayatra

క‌న‌బ‌డుతున్న ఫ‌లితాలు
పాద‌యాత్ర మొద‌లుపెట్టే స‌మ‌యంలోనే కోస్తా జిల్లాల‌కు సంబంధించి ఏ జిల్లాలో ఎవ‌రిని వైసిపిలో చేర్చుకోవాల‌న్న విష‌యంలో వైసిపి నేత‌లు ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాతో చేరిక‌లు మొద‌లైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో రిజ‌ల్ట్ కాస్త‌ క‌నిపించినా కృష్ణా జిల్లాలో మాత్రం చెప్పుకోత‌గ్గ ఫ‌లితాలే క‌న‌బ‌డుతున్నాయి. జిల్లాలోకి అడుగుపెట్టిన రోజే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంఎల్ఏ, టిడిపి సీనియ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి వైసిపిలో చేరారు. ఇపుడు వ‌సంత చేర‌బోతున్నారు. త్వ‌ర‌లో గ‌న్న‌వ‌రంలో సీనియ‌ర్ నేత దాస‌రి జై ర‌మేష్ కూడా వైసిపిలో చేరుతారంటూ  ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ముగ్గురు కూడా చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. 

Image result for chandrababu

ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వంపైనే దృష్టి
జ‌గన్మోహ‌న్ రెడ్డిని దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో చంద్ర‌బాబు వైసిపిలోని ఎంఎల్ఏలు, ఎంపిల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబును దెబ్బ కొట్టేందుకు అదే ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళుతున్నారు. కాక‌పోతే నియోజ‌క‌వ‌ర్గాల్లోని ద్వితీయ‌శ్రేణి నేత‌ల‌పై గురిపెట్టారు. రేప‌టి ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా టిక్కెట్టు వ‌చ్చే అవ‌కాశాలు లేని నేత‌ల‌ను, చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌ల వివ‌రాలు సేక‌రించి మ‌రీ అటువంటి వారిని  జ‌గ‌న్ ల‌క్ష్యంగా చేసుకుని పావులు క‌దుపుతున్నారు. ఏపార్టీకైనా ద్వితీయశ్రేణి నేత‌ల వ‌ల్లే ఉపయోగాలు ఎక్కువుగా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వ్యూహాలు పన్నుతున్నారు. మ‌రి రేపటి ఎన్నిక‌ల్లో ఎవ‌రి వ్యూహం వ‌ర్క‌వుట‌వుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: