ఆలూ లేదు చూలు లేదు..అల్లుడు పేరు సోమ‌లింగం అన్న‌ట్లుగా ఉంది చంద్ర‌బాబునాయుడు మాట‌లు చూస్తుంటే. రెండో రోజైన బుధ‌వారం క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ,  అమ‌రావ‌తి ప్రాంతంలో ఏరియ‌ల్ స‌ర్వే చేసిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ బృందం ప్ర‌పంచం మొత్తం మీద అమ‌రావ‌తి లాంటి న‌గ‌రం ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా రాద‌ని అన్న‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌పంచంలోనే అత్యంత అద్భుతంగా అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించాల‌ని చంద్ర‌బాబు అనుకోవ‌టంలో త‌ప్పేలేదు. కాక‌పోతే అందుకు ఉన్న అవ‌కాశాలు ఎంత అన్న‌దే అస‌లైన ప్ర‌శ్న‌. 

Image result for amaravathi

ప్ర‌ణిళికే సిద్దం కాలేదు
గ‌డ‌చిన మూడున్న‌రేళ్ళుగా రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళికే సిద్దం కాలేదు. ఎంత‌మంది ఆర్కిటెక్టుల‌ను మార్చారో లెక్క‌లేదు. ఎన్ని డిజైన్ల‌ను మార్చారో చంద్ర‌బాబే చెప్ప‌లేరు. నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌పంచ ప్ర‌ఖాతి చెందిన ఆర్కిటెక్టుల్లో ఒక‌రైయుండ‌చ్చు. కానీ ఆయ‌నిచ్చిన డిజైన్లు కూడా చంద్ర‌బాబుకే కాదు సామాన్య జనాల‌కు కూడా న‌చ్చ‌టం లేదు. అందుక‌నే గ‌డ‌చిన ఏడాదిన్న‌ర‌గా ఫోస్ట‌రే ఎన్నో డిజైన్ల‌ను మార్చాల్సి వ‌చ్చింది. విచిత్ర‌మేమిటంటే డిజైన్లు త‌యారు చేయ‌టంలో ఫోస్ట‌ర్ కు బాహుబ‌లి సినిమా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌హాయాన్ని కూడా చంద్ర‌బాబు తీసుకున్నారు. చివ‌ర‌కు ఫోస్ట‌ర్ ఇచ్చిన డిజైన్లు రాజ‌మౌళికి కూడా న‌చ్చ‌ని కార‌ణంగానే స‌ల‌హా బృందం నుండి రాజ‌మౌళి త‌ప్పుకున్నారు. 

Image result for amaravathi

నిర్మాణ వ్య‌య‌మెంతో తెలీదు
రాజ‌ధాని నిర్మాణ వ్య‌యం ఎంతో ఎవ‌రికీ తెలీదు. సిఆర్డిఏ వేసే ప్ర‌ణాళిక‌లు ఒక ర‌కంగా ఉంటే ఫోస్ట‌ర్ బృందం ఇచ్చే ప్ర‌ణాళిక‌లు మ‌రోర‌కంగా ఉంటాయ‌న‌టంలో సందేహ‌మే లేదు. అస‌లు రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌భుత్వ అనుస‌రిస్తున్న స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తికి హై కోర్టే అభ్యంత‌రం చెప్పింది. కాబ‌ట్టి ఏ ప‌ద్ద‌తిలో రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుందో జ‌నాల‌కు స్ప‌ష్ట‌త‌లేదు. రాజ‌ధాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఏంటో ఎవ‌రికీ అర్దం కావ‌టం లేదు ఎందుకంటే, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధాని ప‌రిధిలోని అసెంబ్లీ, స‌చివాల‌యం, రాజ్ భ‌వ‌న్, హైకోర్టు లాంటి కీల‌క భ‌వ‌నాలను కేంద్ర‌మే నిర్మించాలి. కానీ క్షేత్ర‌స్ధాయిలో విరుద్ధంగా జ‌రుగుతోంది.     

Related image

జ‌నాల‌కు ప‌ట్ట‌ని అమ‌రావ‌తి
రాజ‌ధాని నిర్మాణ ప్ర‌క్రియ‌లో ప్ర‌తీ అడుగులోనూ చంద్ర‌బాబు అత్యంత గోప్య‌త‌ను పాటిస్తున్నారు. సింగ‌పూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందంలో ఏముందో ఎవ‌రికీ తెలీదు. ఒప్పందాలు బ‌య‌ట‌పెట్ట‌మ‌ని ఎంత‌మంది అడుగుతున్నా ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్ట‌టం లేదు. అదే విధంగా చంద్ర‌బాబు ఒంటెత్తు పోక‌డ‌ల కార‌ణంగా కేంద్రం కూడా ఏపి రాజ‌ధానితో త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తోంది. అదే స‌మ‌యంలో రాజ‌ధాని నిర్మాణ ప్రాంతంపై అనేక కేసులు న‌డుస్తోంది. వాస్త‌వాలు ఈ విధంగా ఉంటే, ప్ర‌పంచంలోనే ఇటువంటి అద్భుత‌మైన న‌గ‌రం ఇంకెక్క‌డా రాద‌ని ఫోస్ట‌ర్ త‌న‌తో చెప్పార‌ని చంద్ర‌బాబు చెప్ప‌టంలో అర్ధ‌మేలేదు. ఎందుకంటే, రానున్న ఎన్నిక‌ల్లోగా  రాజ‌ధాని నిర్మాణ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని ఎవ‌రికీ న‌మ్మ‌క‌మే లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి నిర్మాణాన్ని కీల‌క‌మైన అంశంగా మార్చుకోవాల‌న్న‌దే చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా క‌న‌బ‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: