కచ్చితమైన ఫలితాలను ప్రకటించడంలో లగడపాటి సర్వేది అందెవేసిన చేయి. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి సర్వే చేశారు.

Image result for lagadapati

          కర్నాటకలో హోరాహోరీ పోరు నడుసోంది. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి పీఠం దక్కించుకునేందుకు అన్ని విధాలా ట్రై చేస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీతోపాటు, సోనియాను కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించింది. మరోవైపు దక్షిణాదిలో తాము కోల్పోయిన పట్టును మళ్లీ దక్కించుకునేందుకు కర్నాటకయే సరైన మార్గమని బీజేపీ భావిస్తోంది. గతంలో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేజేతులా పోగొట్టుకుంది. అయితే ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇక జేడీఎస్ సైతం పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది.

Image result for karnataka elections

          కొంతకాలంగా కర్నాటకలో పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ వచ్చాయి. మెజారిటీ సర్వేలు హంగ్ ఏర్పాటు ఖాయమని స్పష్టంచేశాయి. ఒకట్రెండు సంస్థలు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పగా.. బీజేపీకి పట్టం ఖాయమని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం హంగ్ ఖాయమని, జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని చెప్తున్నాయి. దీంతో పార్టీలు మరింత అలెర్ట్ అయ్యాయి. చివరి నిమిషం వరకూ తమ వ్యూహాలను రచిస్తూ ముందడుగు వేస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నాయి.

Image result for karnataka elections

          గెలుపు రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వేపై అందరి కళ్లూ పడ్డాయి. అయితే లగడపాటి మాత్రం ఈసారి సర్వే ఫలితాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ లగడపాటి తన రెగ్యులర్ సంస్థతో కలిసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఈసారి కర్నాటకలో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 110-120 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70-80, జేడీఎస్ కు 40వరకూ సీట్లు దక్కుతాయని తేల్చారు. కొంతకాలం వరకూ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి సర్వే జోస్యం చెప్పింది. మ్యాజిక్ మార్కును బీజేపీ దాదాపు చేరుకుంటుందని, ఒకవేళ ఒకట్రెండు సీట్లు తక్కువొచ్చినా ఇతరులతో కలిసి అధికారం చేపట్టడం ఖాయమని తెలిపారు. అయితే ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించేందుకు లగడపాటి నిరాకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: