ఈనెల 12న జరుగబోయే కర్ణాటక ఎన్నికలకు ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయపార్టీలతో సహా ఎన్నికల యంత్రాంగం కూడా సిద్దమయిపోయింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారే అత్యధికంగా నివసించడం మూలానా అక్కడి పార్టీలు ఇక్కడి నాయకుల మద్దతును కోరి ప్రత్యక్షముగానైనా లేక పరోక్షంగానైనా ప్రచారపర్వాలు కొనసాగిస్తున్నారు.


ఈ మధ్యనే మాజీ ప్రధాని, కర్ణాటక లోని ప్రముఖ పార్టీ జేడీఎస్ అధినేత దేవెగౌడ మాట్లాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే తమ పార్టీని గెలిపిస్తారని చెప్పి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అయితే నేడు కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వాఖ్యలు దేవెగౌడ మాటలకు ఊతమిస్తున్నాయి. కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని, నిజానికి తాను అక్కడ ఏ పార్టీకి ఓటు వేయమని ఎవరికీ చెప్పలేదని బాబు చెప్పాడు.


తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన పార్టీకి ఓటు వేయద్దంటూ పరోక్షంగా బీజేపీపై చురకలు అంటించాడు. తెలుగుప్రజలను మోసం చేసిన బీజేపీ, అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తోందని, అలా కాని పక్షంలో ఎన్నికల తర్వాతనైనా ఇద్దరు దోస్తీకి పథకం రచిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజలు ఇక్కడ వైసీపీని, కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చెబుతూ జేడీఎస్ కు పరోక్షంగా సహాయం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: