దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఆడది కనపడితే చాలు కాటు వేద్దామా అని కామాంధులు వేచిఉన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్న రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా మొన్న జరిగిన దాచేపల్లి సంఘటనే ఇందుకు నిదర్శనం.


ఇందునుబట్టే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టాలని, ముఖ్యంగా యువకుల్లో లైంగిక ప్రవృత్తిని ప్రేరేపించే అశ్లీల వెబ్ సైట్ లను నిషేధించాలని ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు సూచించారు. నేటికాలంలో ప్రతిఒక్కరిదగ్గర సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటుందని,  అంతేగాక ఇంటర్నెట్ ధరలు తక్కువకావడంతో అశ్లీల వెబ్ సైట్ లను చూస్తున్నారని, అవే మగవారిలో హింసాత్మక విధానాలను ప్రేరేపిస్తుండడంతో వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆజ్ఞాపించారు.


రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఇకముందు మహిళలపై ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడినా అటువంటి వారిని ఉపేక్షించేదిలేదని ఈ మేరకు నిన్న బుధవారం రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా అన్ని జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతల అంశంపై మాట్లాడారు. దీనితో పాటు అత్యాచార కేసులపై సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీ ని చంద్రబాబు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: