కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని  దర్శించుకొని తిరిగి వెనక్కి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనలో టీడీపీ నేతలుండగా ఆ వివాదం టీడీపి మెడకు చుట్టుకోవడంతో ఆ పార్టీపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.


దీనితో ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిద్దుబాటు చర్యలను చేపట్టారు. బీజేపీ జాతీయనాయకుడు అమిత్‌ షా కాన్వాయ్ ను అడ్డుకొని, ఆందోళన చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఆయన కాన్వాయ్‌పై దాడి చేసిన టీడీపీ శ్రేణుల పట్ల బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణకు అందరూ బద్ధులై ఉండాలని, తెలిసీ తెలియకుండా ప్రవర్తించి, పార్టీకి చెడ్డపేరు తేవద్దని ఒక ప్రకటన చేసి మరీ క్లాస్ పీకాడు. 


ఇంతటితో ఆగని ఆయన దాడి చేసిన వారిలో టీడీపీ నేతలు ఉంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని తమ పార్టీ రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధించే విధానం ఇది కాదని ఆయన టీడీపీ శ్రేణులకు వివరించారు. ప్రత్యేక హోదా అనేది దాడులవల్ల రాదని ఆయన తమ పార్టీవారికి చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: