అసలే ఇంటర్నెట్ యొగం. నిద్రలేచినప్పటి నుండి పడుకునేంతవరకు పక్కన మొబైల్ ఫోన్, అందులో ఇంటర్నెట్ లేకుంటే ఈ కాలం యువతకు అసలు దిక్కుతోచదంటే అతిశయోక్తికాదు. ఎక్కడ ఏం జరిగినా చటుక్కున దాన్ని వీడియో తీసేసి దాన్ని  పుటుక్కున అంతర్జాలంలో పెట్టే ఈ కాలం యువత కు ఎవరైనా జంకాల్సిందే. 


అలాంటిది ఒక సెలెబ్రెటీ బయట కనపడితే ఇంకేమైనా ఉందా ? ఫోటో తీసి నానా రభస చేస్తారు. అలాంటిది ఒక మహిళా నటి, ఒక రాజకీయనాయకుడు దేశంకాని దేశంలో కలిసి ఉంటే ఇంకేమన్నా ఉందా? సీను సితార అయిపోదు! సరిగ్గా ఒక ప్రముఖ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కలిసి ఎయిర్ పోర్టు లో కలిసి ఉండడం తీవ్ర చర్చాంశనీయమవుతుంది. 


ఆ మహిళ ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్. ఎక్కువగా తల్లి, వదిన పాత్రలు వేస్తూ ఉంటుంది. ఇంక  తెల్లచొక్కాలో కనిపిస్తున్న వ్యక్తే ఆ రాజకీయనాయకుడు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు. ఈ మధ్య ఒక మహిళా ఎమ్మెల్యేపై కామెంట్లు చేసి వార్తలలో కూడా నిలిచాడు. కాగా వారిద్దరూ కలిసి బ్యాంకాక్ ఎయిర్పోర్టులో వీసా ఆన్ అరైవల్ క్యూలో నిలబడడం చూసి అవాక్కయిన తెలుగువారు వెంటనే తమ కెమెరాలను క్లిక్ అనిపించి ఆ ఫోటోను ఇంటర్నెట్లో వదిలారు.


మరింత సమాచారం తెలుసుకోండి: