ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఉప ఎన్నికలు అనివార్యం అయినాయి. అప్పుడు టీడీపీ నేతలు ఈ రాజీనామాలను ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాలన్నీ ఒట్టి నాటాకాలనీ అవి ఆమోదం పొందవని కుప్పిగంతులు వేసినారు. కానీ ఇప్పుడు స్వయంగా ఏపీ సీఎం ఉప ఎన్నికలు రాబోతున్నాయని సిద్దం గా ఉండాలని ఆయా నేతలకు సూచించాడు. అయితే నిజంగా ఉప ఎన్నికలు వస్తే టీడీపీ కి కష్టం అని చెప్పవచ్చు.

Image result for chandrababu naidu and jagan

నెల్లూరు ఎంపి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, తిరుప‌తి ఎంపి వ‌ర‌ప్ర‌సాద్, క‌డ‌ప ఎంపి అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి మిధున్ రెడ్డిలు రాజీనామాలు చేయ‌ట‌మే కాకుండా ఏపి భ‌వ‌న్లో నిరాహార‌దీక్ష‌లు కూడా చేశారు. అనారోగ్యం కార‌ణంగా వారంద‌రినీ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిని ఢిల్లీ పోలీసులు రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి కూడా అంద‌రికీ తెలిసిందే.

Image result for chandrababu naidu and jagan

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే చంద్ర‌బాబు మాట‌ల‌ను బ‌ట్టి రాష్ట్రంలోని ఐదు ఎంపి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు తప్ప‌వ‌ని స్ప‌ష్ట‌మైంది. వ‌చ్చే ఏడాది జ‌రగాల్సిన సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతాయ‌నుకుంటున్న ఉప ఎన్నిక‌లు ఒక విధంగా చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల తీర్పుగానే భావించాల్సుంటుంది. దీని ప్ర‌భ‌వం క‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌డే ప్ర‌భావ‌ముంటుంద‌ని టిడిపితో పాటు వైసిపిలో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: