రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.   గతంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వే. ఏదైనా కారణాల వల్ల రైలు రద్దు అయితే ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు తిరిగి అదే బ్యాంక్ అకౌంట్‌ కు ఆటోమెటిక్‌ గా వస్తాయని రైల్వే శాఖ తెలిపింది. IRTC ద్వారా రిజర్వేషన్ చేసుకున్న రైళ్ల సర్వీసులు.. రైలు వెళ్లే స్టేషన్ నుంచి చివరి స్టేషన్‌ వరకు రైలు ప్రయాణ సేవలు రద్దు అయితే ఆటోమెటిక్‌ గా PNR రద్దు అవుతుందని రైల్వే శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం IRTC వెబ్‌ సైట్ ను సంప్రదించవచ్చని తెలిపింది.
Image result for railway
తాజాగా విమానాల్లో ప్రయాణీకులకు అందించే తరహాలో.. రైల్వేప్రయాణికులకు కూడా మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని తెలిపారు.  భారత దేశంలో అత్యధికంగా సగటు మనిషి రైల్ ప్రయాణాలు చేస్తుంటారు. కాగా, ఈ మద్య రైలు ప్రయాణీకులకు అనేక వసతులు కల్పిస్తున్నారు.
Image result for railway
రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార పదార్ధాల తయారీలో అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషీయల్ పరిజ్ఞానాన్ని కూడా ఇందుకోసం వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
Image result for railway food
ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యత, రుచి విషయంలో రాజీ పడబోమని లోహాని అన్నారు.  అంతే కాదు జులై 1 నుంచి అన్ని ప్రీమియం రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధునిక హంగులతో 68 కొత్త పాకశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2019 డిసెంబరు నాటికి ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: