మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి రాజకీయ ప్రయాణం డైలమాలో పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో బిజెపి పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో...ఆ పార్టీ ప్రజలను మోసం చేయడంతో..ఈ క్రమంలో పురందేశ్వరి ఎక్కడికెళ్లినా ప్రశ్నలు ఎదురవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Related image
ఇదే విషయాన్ని పురందేశ్వరి తన సన్నిహితుల దగ్గర వాపోయారట. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా విభజించడంతో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవ్వాలంటూ పార్లమెంట్ సాక్షిగా హామీలు ఇవ్వడం జరిగింది.
Related image
ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత నష్టాలపాలు చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుతో కలిసి ఇష్టమొచ్చినట్లు దొంగనాటకాలు రాజకీయాలు ఆడారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ విషయంలో కూడా మొండిచెయ్యి చూపారు.దీంతో బిజెపి పార్టీ లో ఉన్న పురందేశ్వరికి ఈ పరిస్థితులు మింగుడుపడడం లేదు. మరోపక్క రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కూడా రాకపోవడంతో.. పార్టీ మారే ఆలోచనలో నేపద్యంలో వైసీపీ పార్టీలో కి వెళ్లాలని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.
Image result for purandeswari
మరోపక్క వైసిపి అధినేత జగన్ కూడా ముందునుండి చంద్రబాబు అవినీతిని ఎండగట్టడం..ప్రత్యేక హోదా కోసం పోరాడటం అలాగే పురందేశ్వరి తండ్రి ఎన్టీ రామారావును ఎక్కడా కూడా విమర్శించకుండా….చంద్రబాబు ఏ విధంగా ఎన్టీ రామారావును మోసం చేశారో... ప్రజలను ఆ విధంగా చంద్రబాబు మోసం చేశారు అంటూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ...ఎన్టీఆర్ పై గౌరవం చూపిస్తు ముందుకి వెళ్లడంతో...పురందేశ్వరి కూడా వైసీపీ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ ఇటీవల కృష్ణా జిల్లా పేరును నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తానని చెప్పడం కూడా జరిగింది. దీంతో పురందేశ్వరి త్వరలో బిజెపి పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని అంటున్నారు పురందేశ్వరి సన్నిహితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: