ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో రెండువేల మైలురాయి దాటింది. ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జగన్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ వాసులు జగన్ కు నీరాజనం...పట్టారు. జగన్ పై పూలవర్షం కురిపించారు.
Related image
ప్ర‌జాదార‌ణ‌తో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేల మార్క్ దాటిన సంద‌ర్భంగా వెంక‌టాపురం ద‌గ్గ‌ర పైలాన్‌ను ఆవిష్క‌రించారు. ఈ నేపధ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీలో కి వెళ్లాలా వద్దా అనేదానిపై చర్చించినట్లు సమాచారం.
Image result for jagan mudragada
అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాపులను మోసం చేయడంతో….కాపు జాతి తరపున ప్రశ్నించిన నన్ను నా కుటుంబాన్ని చంద్రబాబు చేసిన అవమానాన్ని తలుచుకున్నారట. మొత్తంమీద ఈ సమావేశంలో ముద్రగడ వైసీపీ పార్టీ లోకి చేరడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించినట్టు తెలుస్తుంది.

మరోపక్క జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి తన అనుచరుల దగ్గర ప్రస్తావించారట...ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు పై ఉన్న ప్రజావ్యతిరేకతను ఈ పాదయాత్ర ద్వారా జగన్ అధికార పార్టీని చమటలు పట్టిస్తున్నడన్ని...అంతేకాకుండా మండుటెండలో జగన్ రెండు వేల కిలోమీటర్లు దాటడం ఆషామాషీ కాదంటూ...ఎంతైనా జగన్ మొండి వాడని...అతను అనుకున్నది ఏదైనా సాధిస్తాడని...వైయస్ జగన్ ని తన అనుచరుల దగ్గర ఓ రేంజ్ లో ముద్రగడ పొగిడారట.


మరింత సమాచారం తెలుసుకోండి: