ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. అధిష్టానం నిన్న తీసుకున్న నిర్ణయానికి పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు అతని మద్దతుదారులు నిరుత్సహహానికిలోనయ్యారు. అందుకే నిన్న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి.


ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు చేయడంతో బీజేపీలో రెండువర్గాలు తయారవుతున్నాయా అన్న సందేహంలో పడేసింది. అయితే పరిస్థితి ఇలాగయితే చేయిదాటిపోతుందని బీజేపీ అధిష్టానం భావించిందేమోగాని ఎట్టకేలకు  వీర్రాజును బుజ్జగించినట్లుంది.


ఆయన అజ్ఞాతం నుండే ఒక ప్రకటనను చేసినట్లుగా వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి సోము వీర్రాజు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి, అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, అధిష్ఠానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. పార్టీలోని తన మద్దతుదారులు కానీ, అనుచరులు కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, వ్యతిరేఖ నిర్ణయాలు కానీ, ప్రకటనలు కానీ చేయవద్దని ఆయన తెలిపాడని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: