ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ ఎవ‌రైనా ప్ర‌త్య‌ర్ధుల‌తో సంధి చేసుకుని మిత్రులుగా మార్చుకోవాల‌ని అనుకుంటారు.   అదేంటో మ‌రి చంద్ర‌బాబునాయుడుకు మాత్రం శ‌తృవులు ఎక్కువైపోతున్నారు. మొన్న‌టి వర‌కూ చంద్ర‌బాబుకు గ‌ట్టి ప్ర‌త్య‌ర్ధి అంటే కేవ‌లం వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే ఉండేవారు. ఈ మ‌ధ్య‌నే జ‌గ‌న్ కు తోడుగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌యార‌య్యారు.
Image result for pawan kalyan
తాజాగా మూడో ప్ర‌త్య‌ర్ధిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రెడీ అయ్యారు. మొద‌టి ప్ర‌త్య‌ర్ధి విష‌యంలో ఎవ‌రూ చేయ‌గ‌లిగేది ఏమీ లేదుకానీ మిగిలిన ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్ధులుగా మార‌టం మాత్రం చంద్ర‌బాబు స్వ‌యంకృత‌మ‌నే చెప్పుకోవాలి. ఒక‌వైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రోవైపు రాజ‌కీయ శ‌తృవులు పెరిగిపోతున్నారు. దానికితోడు జ‌నాల్లో ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.  దాంతో చంద్ర‌బాబులో ఆందోళ‌న స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది. 

Image result for ysrcp

చంద్ర‌బాబుకు దూర‌మైన ప‌వ‌న్ 
చాలాకాలం పాటు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒక‌టే అన్న‌ట్లుండేది వ్య‌వ‌హారం. అందుకే పవ‌న్ విష‌యంలో జ‌నాల‌కు పెద్ద‌గా అంచ‌నాలు ఏమీ లేవు. ప‌వ‌న్ ప్యాకేజీ స్టార్ అని కూడా జ‌నాల్లో విస్తృతంగా ప్ర‌చార‌మైపోయింది. నాలుగేళ్ళ‌పాటు అటువంటి ఆరోప‌ణ‌ల‌ను, విమ‌ర్శ‌ల‌నే ప‌వ‌న్ ఎదుర్కొన్నారు. ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ వైఖ‌రి కూడా ఉండేది. అటువంటిది ఏమైందో ఎవ‌రికీ స్ప‌ష్టంగా తెలీదు గానీ ఒక్క‌సారిగా చంద్ర‌బాబుకు ప‌వ‌న్ ఎదురుతిరిగారు. మ‌రి ఇది కూడా ప్యాకేజీలో భాగ‌మేనా అన్న అనుమానాలు కూడా జ‌నాల్లో ఉన్నాయ‌నుకోండి అది వేరే సంగ‌తి. అయితే, మారిన రాజ‌కీయ ప‌రిస్ధితుల్లో చంద్ర‌బాబుపై ఎక్క‌డిక‌క్క‌డ ప‌వ‌న్ ఫుల్లుగా ఫైర్ అవుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కూడా చంద్ర‌బాబుకు ప్ర‌త్య‌ర్ధే అనుకోవాలి.

Image result for kanna laxmi narayan

తాజాగా చంద్ర‌బాబుపై కాలుదువ్వుతున్న క‌న్నా
కేంద్ర‌మంత్రివ‌ర్గం నుండి త‌ర్వాత ఎన్డీఏలో నుండి ఎప్పుడైతే చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చేశారో అప్ప‌టి నుండి బిజెపి రూపంలో మూడో ప్ర‌త్య‌ర్ధి కూడా త‌యార‌య్యారు.  పార్టీ ప‌రంగా త‌ప్ప‌ చంద్ర‌బాబుపై మాజీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఏమీ లేవు. ఏదో ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు మాత్రం చంద్ర‌బాబుపై తీవ్రంగా విరుచుకుప‌డేవారు. అయితే, హ‌రిబాబు స్ధానంలో అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు తీసుకున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రూటే వేరు. హ‌రిబాబు లాగ చంద్ర‌బాబుకు స‌న్నిహితుడు కాక‌పోగా పూర్తిగా వ్య‌తిరేకి. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఒకేసారి ముగ్గురు ప్ర‌త్య‌ర్ధుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న‌టంలో సందేహ‌మే లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: