జాతీయ మీడియా, ఎగ్జిట్ పోల్స్ అంతకు మించి కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్న కర్ణాటక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్క కాంగ్రెస్ నేతలను ఏంటి బీజేపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో అని అనిపిస్తుంది. ఎంత పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ హంగ్ ఏర్పడడంతో బీజేపీయేతర ఎమ్మెల్యేలపై ఆధారపడాల్సి వస్తుంది.


అయితే ఇక్కడ జెడియస్ కు తక్కువ స్థానాలు దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మద్దతును సమకూర్చేలా ఎమ్మెల్యే స్థానాలను గెలవడంతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకం కానుంది. అయితే  ఈ క్రమంలోనే జెడియస్ రెండు వర్గాలుగా చీలినట్లు, కుమారస్వామి సోదరుడయిన రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ చేయడంతో ఆయన ఫిరాయింపుకు సిద్ధమయ్యాడంటూ వార్తలు వచ్చాయి.


కానీ బీజేపీ నేతల ఆశలకు రేవణ్ణ గండికొట్టాడు. అవన్ని వదంతులే అని ఆయన కొట్టిపడేశాడు. బుధవారం ఉదయం జెడియస్ శాసనసభాపక్షనేతగా కుమారస్వామిని ఎన్నుకున్న అనంతరం రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ-  బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. కాంగ్రెస్ తోకలిసి జెడియస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: