తెలంగాణలో చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రరాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కి వచ్చేటట్లు ఉంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేంద్ర పెద్దల కాళ్ళదగ్గర ఢిల్లీ నేతల ఇంటిముందర పడిగాపులు కాస్తూ మేనేజ్ చేసుకుంటూ రాజకీయాలలో రాణిస్తున్న చంద్రబాబుకి సొంత పార్టీ నేతలు షాక్ లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ కి 30 సంవత్సరాలు సేవలందించిన ఖమ్మం జిల్లా సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు.

Image result for chandrababu

దీంతో చంద్రబాబు కి బిగ్ షాక్ తగిలింది. తాను పార్టీ సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ కి...మరియు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫ్యాక్స్ రూపంలో పంపించారు. ఈ దెబ్బకి తెలంగాణలో తెలుగుదేశం పూర్తిగా కనుమరుగై నొప్పి అని అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఛాయలు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లాగానే ఉన్నాయి.

Image result for tdp mani festo 2014

గత ఎన్నికలలో నెరవేర్చలేని అబద్ధపు హామీలిచ్చి...ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు రాష్ట్రానికి ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమం కూడా చేయలేకపోయారు. అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రానికి కనీస ప్రభుత్వ భవనాలు కూడా ఇప్పటివరకు కట్టలేకపోయారు. ఏది చేసిన తాత్కాలిక మంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి ముఖ్యమైన హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వంకరటింకర రాజకీయాలు చేసి కేంద్ర పెద్దల దగ్గర రాష్ట్ర అభివృద్ధి ని తాకట్టు పెట్టారు.

Image result for tdp mani festo 2014

ఇటువంటి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబుపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుతోంది. మరోపక్క ప్రతిపక్షనేత జగన్ ప్రత్యేక హోదా విషయంలో అలాగే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంద అన్న విషయంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ...ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో ఉండవంటూ వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: