చంద్ర బాబు నాయుడు ఇప్పడు కర్ణాటకలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతూ రాజ్యంగ విలువలను బీజేపీ పాతర వేస్తుందంటూ తన మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడినాడు. అయితే చంద్ర బాబు నాయుడు ఈ మాటలు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి పక్ష పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చినాడు. కానీ ఇప్పుడేమో బాబు గారు బీజేపీ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. 

Image result for chandrababu naidu

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భజన చేయించుకొంటూ.. అదే తన రాజకీయ విజయయాత్ర అని చెప్పుకొంటున్నాడు. ఇక గవర్నర్ చేత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కించడంలో చంద్రబాబుది అందె వేసిన చెయ్యి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఏపీలో గవర్నర్ చేత ప్రమాణస్వీకారం చేయించింది ఈ చంద్రబాబే సుమా! ఆ చంద్రబాబు, ఈ చంద్రబాబు వేర్వేరు కాదు. ఇద్దరూ ఒకరే.

Image result for chandrababu naidu

ఏపీలోనేమో ఎమ్మెల్యేల చేత తనే ఫిరాయింపులు చేయించవచ్చు. వారితో రాజీనామా చేయించకుండా హీనమైన విమర్శలను ఎదుర్కొంటూ రాజ్యాంగ విలువలకు పాతర వేయవచ్చు. అదే బీజేపీ చేస్తే చంద్రబాబులో నిద్రపోతున్న గాంధీతాత లేచొస్తాడు. విలువలు పతనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఏంటయ్యా.. చంద్రబాబు? ఎక్కడ వరకూ నీ దిగజారుడు? ఇటువంటి ప్రశ్నలు సామాన్య జనాలు కు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: