ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఘాటు వాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించడు కానీ ఆయనకు బదులు మంత్రి ఉమామహేశ్వర రావు మాత్రం ఘాటు రిప్లై లు ఇస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న జగన్ ఒళ్ళు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నాడని విమర్శించిన ఆయన నేడు మళ్ళీ తనదైన శైలిలో విమర్శించాడు.


మొన్న గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారిని  ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ అవి ప్రభుత్వం చేయించిన హత్యలుగా అభివర్ణించాడు. దీనికి స్పందించిన ఉమ, చనిపోయిన వారి కుటుంబాలకు ఇంకా ఏ విధమైన మెరుగైన సహాయ కార్యక్రమాలను అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే జగన్ అలా మాట్లాడటం అతని దిగజారుడుతనం అని వాఖ్యానించాడు.


ప్రజాసంకల్ప యాత్ర ఒక దగా యాత్రగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి కూడా తన యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం సరికాదన్నారు. రాష్ట్రం గురించి అంతలా పరితపించేవాడవే అయితే విభజన హామీలలో మోసం చేసిన మోడీని ఎందుకు విమర్శించలేదు అని ఆయన జగన్ కు ప్రశ్నవేసారు. త్వరలొనే అంధ్రప్రజలు వైసీపీకి బుద్ది చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: