నెల్లూరు రాజకీయాలు మరో సారి బాగా వేడెక్కినాయి. నెల్లూరు జిల్లాలో కీలక నేత గా చెప్పుకుంటున్న, ఆనం ప్రస్తుతం ఆత్మకూరు ఇంచార్జి గా ఉన్నాడు. అయితే ఆనం పార్టీ మారబోతున్నాడనే వార్తలు ఇంతక ముందు కూడా హల చల్ చేశాయి. అయితే ఇప్పుడు స్వయంగా ఆనం రామ నారాయణ రెడ్డి  తన అసంతృప్తి ని వెల్ల గక్కడం తో తను పార్టీ మార బోతున్నారన్న విషయంలో కొంత క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. బహిరంగంగానే టీడీపీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి మీద విమర్శలు చేసినాడు. 

Image result for anam ramanarayana reddy

గ‌త‌కొంత‌కాలంగా ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీపై అస‌హ‌నంతో ఉన్నార‌ని,వాళ్లు త్వ‌ర‌లోనే పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.కానీ చంద్ర‌బాబుతో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు.ఇంత‌లోనే ఆనం వివేకానంద‌రెడ్డి అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడ‌వ‌టంతో ఇక రాజ‌కీయప‌ర‌మైన చ‌ర్చ పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.కానీ, తాజాగా ఆనం చేసిన వ్యాఖ్య‌లు మాత్రం పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.టీడీపీలో చేరే స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ అనేక హామీలు ఇచ్చార‌ని,పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని చెప్పార‌ని,కానీ ఆఖ‌రికి ఆత్మ‌కూరు ఇంచార్జ్ గా ప్ర‌క‌టించి త‌మ‌ను చార్జింగ్ లేని నేత‌లుగా మిగిల్చార‌ని మండిప‌డ్డారు ఆనం.

Image result for anam ramanarayana reddy

మంత్రి సోమిరెడ్డి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా రైతులంతా టీడీపీకి దూరం అవుతున్నార‌ని,ఈ ప‌రిస్తితి ఇలానే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌ను ఇంచార్జ్ గా ప్ర‌క‌టించిన ఆత్మ‌కూరులోనూ మంత్రి ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయ‌ని, ఆయ‌న‌కు సంబంధం లేక‌పోయినా కావాల‌నే జోక్యం చేసుకుంటున్నాడ‌ని, గ‌తంలో తాను ఏకైక మంత్రిగా ఉండి జిల్లాకు అనేక అభివృద్ధి ప‌నులు చేశాయ‌ని, వైఎస్సార్ హ‌యాంలో నెల్లూరు జిల్లా ఓ వెలుగు వెలిగింద‌ని, ఇప్పుడు సోమిరెడ్డి కార‌ణంగా ప్ర‌జ‌లంతా పార్టీకి దూరం అయ్యే ప‌రిస్తితి ఏర్ప‌డింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: