సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రజలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎక్కడికి వెళ్లినా ఇసుకవేస్తే రాలనంత జనం వస్తారంటే అది అతిశయోక్తి కాదు. అందుకనే తాను రాజకీయ పార్టీ పెట్టినపుడు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవన విధానాలను అర్థం చేసుకోవడానికి, అసలు ప్రజలు తమకు ఎలాంటి ప్రభుత్వం రావాలని ఆశపడుచున్నారో వంటి వాటిని అవగాహన  చేసుకుని రాజకీయాలలో కొద్దిపాటి జ్ఞానాన్ని సంపాదించుకుందామనుకున్నప్పటికీ అభిమానులు కేవలం తనను చూడ్డానికి వచ్చి తన కార్యక్రమానికి కొద్దిపాటి అసౌకర్యాన్ని గురిచేస్తారేమో అని ఆ ఆలోచనను మానుకున్నాడు.


ఇదే విషయన్ని కూడా ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అయితే రానురాను ఇలాగే ఉంటే ఓట్లు పడవని భావించిన పవన్ తానా స్పీడును పెంచాడు. ఎక్కడ సమస్యవుంటే అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి ప్రజలలో తాను ఒక పార్టీని నడిపిస్తున్నాను అనే విషయాన్ని తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇదిలా ఉంటే టీడీపీ నుండి బయటకు వచ్చిన తరువాత మరో గేర్ ను మార్చాడు. ఏకంగా రాష్ట్రంలో యాత్ర ను మొదలుపెట్టి ఓటుబ్యాంక్ పైన కన్నేశాడు.


ఇదే క్రమంలో ఇచ్చాపురం సభలో  ప్రసంగిస్తూ ఎప్పుడూ చెప్పని, ఆసక్తికర వాఖ్యని చేశాడు. "నేను వెళ్లిన ప్రతి చోట అభిమానులు, కార్యకర్తలు నన్ను పదే పదే సీఎం, సీఎం అని అరుస్తున్నారు, అలా అరవడం కాదు వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని మీ తల్లితండ్రులకు చెప్పండి" అని మాట్లాడారు. నిజానికి ఈ వ్యాఖ్యలను పవన్ ఏనాడూ చేయలేదు. సినిమా వాళ్లు వస్తే వారిని చూడ్డానికి ప్రజలు రావడం సహజం. అంతేకాని వచ్చిన ప్రతిఒక్కరూ ఓటు వేస్తారనుకోవడం అది భ్రమే. ఈ విషయం పవన్ కు బాగా తెలుసు. ఎందుకంటే తన అన్న చిరు పతనాన్ని దగ్గరుండి చూసాడు. ఈ క్రమంలోనే కొద్దిగా ఆలస్యమయినా తేరుకొని కార్యకర్తలకు ఓటు వేయమని చెప్పడమే గాక వేయించమని చెప్పడం అతడు రాజకీయ అనుభవం గడించాడని తెలుపుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: