విజయమ్మ దీక్ష వెనుక విస్తృత ఆలోచన ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందులో అందరికి కనిపిస్థున్నది సీమాంధ్రలో తిరుగులేని పార్టీగా వైఎస్సార్ సిపి అవతరించడం, అధికారం దక్కించుకోవడం, ఇది వంద శాతం కరెక్టే. కాని దీని వెనుక అసలు సిసలైన అంతుచిక్కని మరో భారీ ప్రయోజనం ఉందని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

ఉన్నంటుండి తెలంగాణను వదిలిపెట్టి యూటర్న్ తీసుకోవడంలో జగన్ విస్తృత ఆలోచన దాగి ఉందంటున్నారు. సిబిఐ జేడి బదిలీ, ఇప్పుడు  ఆయన కేసును చూస్థున్న అసలైన అధికారి డిఐజి వెంకటేష్ కాలపరిమితి అయిపోతుండడం, జగన్ కేసులో చార్జిషీట్ల దాఖలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలను కల్పించింది. ఇది కాంగ్రెస్ కావాలని చేసిందా... లేకుండా జరిగిపోయిందా.. అన్నది పక్కన బెడితే జగన్ కు బెయిల్ రాకుండా చేయడానికి ఓ అవకాశం కాంగ్రెస్ కు దక్కిందన్నమాటే.

దీంతో జగన్ 2014 ఎన్నికల వరకు జైలునుంచి బయటకు రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని భావించాడట. అందుకే విజయమ్మ దీక్షతో సీమాంధ్రను పూర్థిగా జగన్ పార్టీ వైపుకు తిప్పుకోవడం, అందులో సక్సెస్ అయితే జగన్ అవసరం కాంగ్రెస్ కు కంపల్సరీ కావడం, పలితంగా జగన్ విషయంలో అది మెత్తబడి జగన్ విముక్తి కావడం జరుగుతుందన్న విస్తృత ఆలోచన విజయమ్మ దీక్ష వెనుక ఉందంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కాని, ఈదీక్ష విజయవంతం అయి అనుకున్న క్రెడిట్ దక్కితే జగన్ కుటుంబానికి అధికారం మాత్ర ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: