తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మాణం చేసింది..ఆ సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అందుకు సమ్మతం పలికింది.  కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలనలో ఉన్న ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా అసలు ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తెల్చి చెప్పింది.  దీంతో ఇప్పుడు ఏపిలో సామాన్య ప్రజలే కాదు..రాజకీయ నేతలు కూడా ఆవేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పార్లమెంట్ లో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష కూడా చేశారు.  తిరుపతిలో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం సభ నిర్వహించారు చంద్రబాబు. 
Image result for dharma poratam vizag
కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టీడీపీ సారధ్యంలో ధర్మపోరాట సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఈరోజు విశాఖపట్నంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ధర్మ పోరాట సభ  నిర్వహించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదని, విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారన్నారు. నాలుగేళ్ళు చాలా ఒపికపెట్టామన్నారు. మొదటి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామని, రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అని, మూడో ఏడాది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని, చివరిగా నాలుగో ఏడాది మనరాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారన్నారు.
Image result for dharma poratam visakhapatnam nara lokesh
సార్వత్రిక ఎన్నికల సమయంలోటీడపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకోవడానికి కారణం కేంద్రంలో బీజేపీ ఉంటే..తమ రాష్ట్రానికి ప్రత్యేక పెట్టుబడులు, ఆర్థిక సహాయం, ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకమే..కానీ  బీజేపీ మిత్ర ధర్మానికి వెన్నుపోటు పోడిచిందన్నారు. విభజన వాళ్ళ ఏపీ లో లోటు బడ్జెట్ ఉందని, అయినప్పటికీ అనింటినీ అధిగమించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: