సేవే మార్గం అనుకుంది.. నర్సుగా రోగాల బారిన పడినవారికి సేవ చేస్తూ.. అందులోనే ఆనందం వెతుక్కుంది. కానీ విధి చిన్నచూపు చూడడంతో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కేరళలో నిపా వైరస్ బారిన పడి.. ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె.. భర్తకు రాసిన హృదయ విదారక లేఖ.. అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

 Image result for kerala nurse

పేరు లిని.. వయసు 28 ఏళ్లు..  కేరళ కొలికోడ్ లోని పెరంబరా తాలూకా ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహించేది. నిపా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించిన లినికి కూడా నిపా వైరస్ సోకింది.  చికిత్స పొందుతూ సోమవారం ఆమె తుదిశ్వాస విడిచింది. చనిపోయే ముందు లిని.. తన భర్తకు రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. బహ్రెయిన్ లో ఉద్యోగం చేస్తున్న లిని భర్తకు రాసిన లేఖలో .. తనకు నిపా వైరస్ సోకిందని.. ఇక తనను చూడలేనని రాసిన లిని.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరింది. ఈ లాస్ట్ లెటర్ ఇప్పుడు ఎంతో మంది హృదయాలను కదిలిస్తోంది.

 Image result for kerala nurse

కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 10 మంది మృత్యువాత పడగా.. మరికొంతమంది ఈ వైరస్ బారిన పడి.. చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్నారు. నిపా వైరస్ కలకలంతో.. కేంద్రం సైతం అలెర్ట్ అయింది... కేరళకు ప్రత్యేక  వైద్యబృందాలను పంపింది. దేశమంతా నిపా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిపా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం చాలా కష్టమైన పని..ఆ వైరస తమకు సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ వైపు బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తూనే.. తమకు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా.. ఆ వైరస్ మనలోకి రాదన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి పరిస్థితే.. ఓ నర్సుకు ఎదురైంది.

 Image result for kerala nurse

నిపా వూరస్ తో మరణించిన లిని మృతదేహాన్ని... బంధువులు కూడా చూడలేకపోయారు. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు.. తన మృతదేహాన్ని వెంటనే ఖననం చేయాలని ఆమె ఆస్పత్రి వర్గాలను చివరి కోరికగా కోరింది. ఆమె పిల్లలు కూడా చివరి చూపు దక్కించుకోలేకపోయారు. లిని మరణంపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లిని భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: