కొన్ని ఏళ్ల పాటు నిర్విరామంగా దేశాన్ని పరిపాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ ఎంత పెద్ద పార్టీ అయినా ప్రజాస్వామ్యం లో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఓటమి పాలు కాక తప్పదని కాంగ్రెస్ కు గుణ పాఠం వచ్చింది. కర్ణాటక లో 2013 లో అతి పెద్ద పార్టీ గా అవతిరించి ఒంటరిగిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పడూ పరిస్థితి వింతగా మారింది. రెండో అతి పెద్ద పార్టీ గా అవతిరించిన సీఎం కాండిడేట్ ను కూడా నియమించ లేని పరిస్థితి. 

Image result for congress

కేవలం సీఎం సీటే కాదు.. దేన్నీ డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ. జేడీఎస్ ఎన్ని పదవులు విదిలిస్తే అవి తీసుకుని సంతోషపడాల్సిందే. అంతకు మించి సీన్ లేదు. ఈ తోక పాత్ర ఇంతటితో పరిమితం కాకపోవచ్చు. ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలానే తయారవుతోంది. బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇదే. ఇక దక్షిణాదిన తమిళనాడులో డీఎంకేకు తోకలో ఈకలా ఉంది కాంగ్రెస్.

Image result for congress

తమిళనాడులో కాంగ్రెస్ పతనం అయ్యి చాలాకాలం అయ్యింది. ఏపీలో నాలుగేళ్ల కిందట తుడిచిపెట్టుకుపోయింది. కేరళలో అధికారం చేజారింది. అక్కడ బీజేపీ అడుగుపెట్టేసింది. కర్ణాటకలో అధికారం స్థాయి నుంచి తోక స్థాయికి వచ్చింది. ఎక్కువ సీట్లు ఉన్నా తోకగా మిగిలిపోవాల్సి రావడం కాంగ్రెస్ దౌర్భాగ్యం. ఈ పరిస్థితి చూస్తుంటే.. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా తోకగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. రేపటి ఎన్నికల్లో యూపీలో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుంటే.. ఇస్తే కాంగ్రెస్‌కు ముష్టిగా కొన్నిసీట్లు ఇవ్వొచ్చు. ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ నో అంటే.. సోలోగా బరిలోకి దిగాల్సి రావొచ్చు. అలా పోటీచేసినా కాంగ్రెస్ సాధించేది ఏమీలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: