పాము పడుకుంది కదా అని పదధ్యానంగా ఉంటే..కాటేస్తది..పవన్ కళ్యాన్ కూల్ గా ఉన్నాడని రెచ్చిపోతే..తాట తీస్తా..! జాగ్రత్తా..తాను అన్నింటికి తెగించిన వ్యక్తినని, తప్పుడు సంకేతాలకు, తప్పుడు వేషాలకు భయపడే వాడిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాను.. కిరాయి గూండాలని పంపించి నిన్న రాత్రి పలాసలో నేను ఉంటున్న ప్రాంతంలో కరెంట్ తీసేసి దాడి చేసేందుకు ప్రయత్నించారు మీ నాయకులు. నేను అన్నింటికీ తెగించిన వ్యక్తిని .
Image result for pawan kalyan takkali
ఇలాంటి తప్పుడు సంకేతాలకి, తప్పుడు వేషాలకి భయపడే వాడు కాదు పవన్ కల్యాణ్. నేను ఉంటున్న ప్రాంతంలో కరెంట్ లేకుండా చేసి.. నాపై దాడి చేసేందుకు తెలుగు దేశం పార్టీ 15 మంది రౌడీలను నాపైకి పంపింది... ఇలాంటి బెదిరింపులకు బయపడే వాడు కాదు పవన్ కళ్యాణ్. పిచ్చి.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు పవన్ కళ్యాణ్. ఒక పరిశ్రమ పెట్టాలన్నా.. పోర్టు పెట్టాలన్నా వాటి వల్ల నష్టపోతున్న వారికి పునరావాసం కల్పించాలి. భూములు కోల్పోతున్న వారిని ఆదుకోవాలి. ఇవేం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం.

ఇది శ్రీకాకుళం నేల.. రక్తం చిందించే నేల.. అన్యాయాన్ని ఎదిరించే నేల. పోరాటాల గడ్డ మన శ్రీకాకుళం. తెలుగు దేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే కాకుండా ఎవరికి అన్యాయం జరిగితే అందర్నీ ఆదుకోవాల్సి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ని తూట్లు తూట్టు పొడిచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారు. రెండు గంటల దీక్షకు రూ.40 లక్షల ప్రజాధనాన్ని ఉపయోగించారు.  ఈరోజు టెక్కలిలో చాలా అన్యాయం జరిగింది. జనసేన నిరసన కవాతు జరపకుండా లారీలు అడ్డుపెట్టారు. నన్ను తిరగకుండా ఆపాలనుకున్నారు. అడుగడుగునా అడ్డుకోవాలనుకున్నారు.
Image result for pawan kalyan srikakulam tekkali
మీరు లారీలు అడ్డుపెట్టగలరేమో కాని.. నా గుండెల్లో ఉన్న ధైర్యాన్ని తీయలేరు. ముఖ్యమంత్రి గారూ.. మీరు రౌడీలను, గూండాలను పంపితే, మేము సైనికుల స్ఫూర్తితో మీ కిరాయి గూండాలను బట్టలూడదీసి కొడతాం, తరిమి తరిమి కొడతాం. టెక్కలిలో జనసేన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టించారు. రాత్రి పలాసలో విద్యుత్ సరఫరా నిలిపివేసి భయపెట్టాలని చూశారు. ఇలాంటి వాటికి భయపడేవారు కాదు జన సైనికులు. కవాతు ఆపిన గుండెల్లో మాటలు అగవు, తూటాలు దిగినా అడుగు ముందుకే, వెనకడుగు వెయ్యదు’ అని పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: