2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి కట్టి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేక కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా పార్టీ పెట్టి ఆ కల సాకారం చేసుకున్న కేసీఆర్.. తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని ఈ  మధ్యే చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా.. ఇంతవరకూ మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Image result for kcr

          ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్, బీజేపీలను అధికారంలోకి రానీయకుండా చేయవచ్చని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలన్నారు. అందుకోసం తృణమూల్ అధినేత మమత బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడ, డీఎంకే అధినేత కరుణానిధి, ఎస్పీ అధినేత అఖిలేష్.. తదితరులతో కేసీఆర్ భేటీ అయ్యారు. కోలకత వెళ్లి మమతతో, బెంగళూరు వెళ్లి దేవెగౌడతో, చెన్నై వెళ్లి కరుణానిధితో సమావేశమయ్యారు. అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ కు రప్పించుకుని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సమావేశమవుతానని ప్రకటించారు.

Image result for kcr

          అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలన్నీ బీజేపీ కోసమేనని పలు పార్టీలు అనుమానిస్తున్నాయి. కేసీఆర్ కోల్ కత వెళ్లి మమత బెనర్జీని కలిసినప్పుడు ఆమె ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో పోరాడుతుంటే.. వారికి మద్దతు ఇవ్వకుండా సభను టీఆర్ఎస్ అడ్డుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అని మమత.. కేసీఆర్ ను నిలదీశారు. దీంతో కేసీఆర్ షాక్ కు గురయ్యారు. అంతేకాక.. కర్నాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవెగౌడను కలిసినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలే తలెత్తాయి. జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించడం ఖాయమనే సర్వేల అంచనాల నేపథ్యంలో ఆ పార్టీని.. బీజేపీతో కలిసేలా చర్చలు జరిపేందుకే ఆయన బెంగళూరు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అంటే కేసీఆర్ చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ బీజేపీకి మేలు చేకూర్చేందుకేననేలా ఉన్నాయి.

Image result for karnataka

          తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ తిరుగులేని పార్టీ. ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈసారి గట్టిపోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణకు మద్దతు ఇచ్చి, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా ఆ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నించలేదు. పైగా తమ నేతలను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ఏమాత్రం ప్రయత్నించలేదు. అంటే పరోక్షంగా కేసీఆర్ తో సంబంధాలు నెరుపుతోందనే అనుమానం కలిగింది. ఇన్ని అనుమానాల నేపథ్యంలో కేసీఆర్ ఏం చేసినా ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

Image result for kcr

          కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కాకుండా ఒక రోజు ముందే వెళ్లి అభినందనలు తెలిపి వచ్చారు. మరుసటిరోజు స్వామి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్, టీఎంసీ, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, ఆప్, లెఫ్ట్.. తదితర పార్టీల నేతలందరూ హాజరయ్యారు. కేసీఆర్ కూటమి కట్టాలనుకున్న నేతలందరూ బెంగళూరులో ప్రత్యక్షమయ్యేసరికి కేసీఆర్ కు దిమ్మతిరిగిపోయింది. ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఆశలు ఆవిరైనట్టే. పైగా అక్కడ చంద్రబాబు కీరోల్ తీసుకున్నారు. మమత, లెఫ్ట్ పార్టీల నేతలు చంద్రబాబును లీడ్ చేయాల్సిందిగా ఆహ్వానించడం కేసీఆర్ కు రుచించని వార్త. దీంతో కేసీఆర్ ఒంటరి అయిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: