రంగులు వేసుకునేవారు రాజకీయాలలో ఏం పనికొస్తారని అప్పుడు చులకనగా మట్లాడారు. అయితే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు రాజకీయాలలో కొచ్చి ఒకప్పటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో  మిగిలిన పార్టీలకు వణుకు పుట్టించాడు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే సీఎం స్థానాన్ని సంపాదించి రాజకీయాలలో మాట తీరు మాత్రం ఉంటే సరిపోదు ప్రజలలో నమ్మకం ఉండాలి అనే గుణపాఠాన్ని నేర్పాడు.


ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు1982 లో టీడీపీ పార్టీలో చేరారు. అప్పటిలో ఆయన పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. ఇక 1995 లో అంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపు నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన టీడీపీ నుండి బయటకి రావడం జరిగింది. ఇక అప్పటినుండి పూర్తి స్థాయిలో సినిమాల మీదనే దృష్టి పెడుతూ అన్ని పార్టీలకు తటస్థంగా ఉన్నాడు.


అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా తరపున ఆయన బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం సొంత జిల్లాలో ఆయనకు చెక్ పెట్టే  ప్రాభల్యం ఉన్న వ్యక్తి మోహన్ బాబు అవడంతో జగన్ టికెట్ ఇవ్వడానికి సుముఖుంగా ఉన్నాడంట.  అంతేగాక మంచు ఫ్యామిలీ, వైస్ ఫ్యామిలీ రెండు బంధువులు కావడం విశేషం. తాను ఏ పార్టీలో చేరబోతున్ననేది ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరువాత ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: