కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కులం అంటగడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో చాలామంది ప్రముఖులు తెలుగు దేశం ప్రభుత్వంపై ఎంపీ మురళీమోహన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Image result for murali mohan
అంతేకాకుండా వెంకన్న చౌదరి అంటూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్వరస్వామి భక్తులు కూడా మండిపడుతున్నారు. ఈ సందర్భంగా  టాలీవుడ్ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ కూడా మురళీమోహన్ పై తీవ్రస్థాయిలో మాట్లాడారు...ఇలా దేవుళ్లకు కులాలను అంటగడుతూ ప్రచారం చేయడం సరికాదన్నారు. మురళీమోహన్‌కు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తమ ఇంటిపక్కనే ఆస్పత్రి ఉందని అక్కడ చూపించుకోవాలని చిన్నికృష్ణ సలహా ఇచ్చారు.
Image result for murali mohan
ఇంకా చాలామంది ప్రముఖులు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో రోజురోజుకు ఈ విషయం పెద్దదవడం తో మురళీమోహన్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశారు...ఈ నేపద్యంలో ఆయన ఏమన్నారంటే నేను కావాలని వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి అలా అనలేదని, ఆ సందర్భం లో బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడుతున్నాను,
Related image
దానితో ఆ మాట అలా బయటకు వచ్చిందితప్ప, కావాలని దేవుడికి కులాన్ని అంటగట్టే అంత తప్పుడు మనిషిని కాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలను విన్న ప్రతిపక్ష నాయకులు ఆయన చెబుతున్న మాటల్లో నిజం లేదని అంటున్నారు..మురళీమోహన్ మనసులో ఉన్నదే  ఆరోజు తెలియజేశారని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: