కర్ణాటక రాష్ట్రం లో బీజేపీ అధికారం లో కి రాకపోయినా సింగల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించింది. అయితే అంత మెజారిటీ ఎలా సాధ్యం అయిందని డౌట్ రావొచ్చు. ఇక్కడ కూడా బీజేపీ కి తెలిసిన మతం అనే అజెండా తో ముందుకు పోయింది. బీజేపీ పుట్టుక కూడా మతం తోనే ముడి పడింది. బీజేపీ అనుసరించే వ్యూహం ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం అధికారంలో ఉన్న పార్టీకి వ్య‌తిరేకంగా ఒక వ‌ర్గం ఓట‌ర్ల‌ను సంఘ‌టితం చేయ‌టం. ఉద్వేగ‌భ‌రిత‌మైన అంశాల‌ను ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే మ‌త‌ప‌రంగా సున్నిత‌మైన‌ అంశాల‌ను లేవ‌నెత్త‌టం.

Image result for chandrababu naidu and modi

వివాదాస్ప‌ద అంశాల‌ను లేవ‌నెత్త‌టం, త‌ర్వాత అదే అంశంపై చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు నిర్వ‌హించ‌టం ద్వారా జ‌నాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను పెంచ‌ట‌మ‌న్న‌దే క‌ర్నాట‌క ఫార్ములా. ఇపుడ‌దే రాష్ట్రంలో జ‌రుగుతోంద‌ని అనుమానాలు మొద‌ల‌య్యాయి. తిరుమ‌ల శ్రీ‌వారి సేవ‌ల్లో లోపాలు, ఆల‌యంలో శ్రీ‌వారికి అలంక‌రించే కోట్లాది రూపాయ‌ల విలువైన వ‌జ్రాభ‌ర‌ణాలు మాయ‌మ‌య్యాయ‌ని ప్ర‌చారం, నిధి, నిక్షేపాల కోసం ఆల‌యంలో త‌వ్వ‌కాలు జ‌రిపార‌న్న ఆరోప‌ణ‌లు, ప్రచారం లాంట‌వి ఫార్ములాలో భాగ‌మ అనే అంటున్నారు.

Image result for chandrababu naidu and modi

కోస్తా క‌ర్నాట‌క‌లో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన ఉడిపిలో సుమారు 2 వేల మంది సాధు, సంతుల‌తో విశ్వ‌హిందు ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున స‌ద‌స్సులు, స‌మావేశాలు నిర్వ‌హించ‌టం మొద‌లుపెట్టింది. మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ హిందువుల‌ను అణిచివేశారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు, చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది. ఇపుడు తెలంగాణా, ఏపిల్లో కూడా అదే ఫార్ములాను అనుస‌రించాల‌న్న‌ది బిజెపి వ్యూహంగా క‌న‌బ‌డుతోంది. ఇప్ప‌టికే ఏపిలోని గ్రామ‌స్ధాయిల్లో 23 వేల బూత్ క‌మిటిల‌ను బిజెపి నియ‌మించింది. మ‌రో 15 వేల క‌మిటిల ఏర్పాటును ల‌క్ష్యంగా పెట్టుకుంది. వ‌చ్చే ఆగ‌స్టు నెలాఖ‌రుకు మొత్తం బూత్ క‌మిటీల ఏర్పాటును పూర్తి చేయాల‌ని అమిత్ షా ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: