భారత దేశ స్వాతంత్రం చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఎంతో గొప్ప పేరు ఉంది.  మన్యం ప్రజలపై బ్రిటీష్ అధికారులు కొనసాగిస్తున్న అరాచకాలను అడ్డుకొని వారిని ఎదుర్కొని మన్యం ప్రజల్లో ధైర్యాన్ని నింపాడు.  స్వాతంత్య్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాట గాథను వింటేనే ప్రతి పౌరుడి రక్తం ఉరకలు వేస్తుంది. దేశభక్తి ఉప్పొంగుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్  జగన్ పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే పశ్చిమగోదావరి జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామన్నారు.
People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi
ప్రజా సంకల్పంలో భాగంగా జిల్లాలోని ఆకివీడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ఈ కీలక ప్రకటన చేశారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు క్షత్రియ కులస్థులు వచ్చి తనను కలిశారని.. దేశం కోసం పోరాడిన అల్లూరి త్యాగాలను ప్రభుత్వాలు మర్చిపోయాయనని.. తన దృష్టికి తెచ్చారన్నారు వైసీపీ అధినేత. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా..ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని..ఇంకా ప్రజలకు లేని పోని హామీలు ఇస్తూ..దారుణంగా మోసం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తగిన బుద్ది చెప్పాలని...ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు తెలియజేస్తున్నారు. 
Related image
 స్వాతంత్ర  సమరయోధుడైన అల్లూరి సీతారామరాజుబ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడారని.. ఇప్పటి వరకు ఆయనకు సరైన గౌరవం దక్కలేదన్నారు జగన్. దేవుడి ఆశీస్సులు తనపై ఉండి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెడతామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మాత్రమే కాదు.. ఇటీవల కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని కూడా చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: