సమైఖ్యరాష్ట్రాన్ని విడగొట్టి తగిన మూల్యం చెల్లించుకొంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని  విభజిస్తే ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేరు అని ఆలోచించి ఎలాగూ రాష్ట్రాన్ని ఇచ్చాము కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా  అధికారం తధ్యం అని అధిష్టానం భావించింది. అయితే ఊహించినట్లుగానే ఆంధ్రాలో నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకపోయిన కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణాలో కూడా చతికిలపడింది.


అయితే తెలంగాణలో కనీస స్థానాలు సంపాదించుకోలేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదాయైనా సంపాదించుకుంది. ఆంధ్రలో అయితే కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరం. అసలు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉండేదంట అని ప్రజలు మాట్లాడుకునే స్థాయికి దిగజారింది. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుందని భావించిన కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ దిద్దుబాటు చర్యలను వేగవంతం చేస్తున్నాడట.


ఈ క్రమంలోనే పార్టీలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నాడంట రాహుల్. ఇప్పటికే ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డిని తొలగించి ఆ పదవిలో చిరంజీవిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రఘవీరా రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరచడం లేదు సరికదా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయట్లేదంట.


ఇందువల్లనే చిరంజీవికి ఈ భాద్యతను అప్పగించి పోయిన ఓటు బ్యాంక్ ను సంపాదించుకోవాలని భావించిన కాంగ్రెస్ అధినేత నిర్ణయానికి సోనియా గాంధీ కూడా తల ఊపారట. ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న చిరు మొన్న పవన్ ఆడియో వేడుకలో తన పార్టీకి సహాయం అందిస్తానని చెప్పాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం లేదని వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో కొనసాగడమనేదే ఒక విషయం అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి భాద్యతను ఎలా ఒప్పుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: