రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జోషును పెంచాడు. ఈ క్రమంలోనే పోరాటయత్ర పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఉద్దానం సమస్య మళ్ళీ ఆయన దృష్టికి రావడంతో వెంటనే ఉద్దానంకు ఆరోగ్యశాఖా మంత్రిని నియమించాలని పవన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించినా స్పందించకపోవటంతో ఒక రోజు నిరాహారదీక్షకు కూర్చున్నాడు.


కాగా నేడు సాయంత్రం 5 గంటలకు ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం నిమ్మరసం ఇచ్చి ఆయనను దీక్ష నుండి విరమింపజేశారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబుపై, ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. బాబు అనుకుంటున్నట్లు తాను రాజకీయ లబ్దికోసం దీక్ష చేయడం లేదని తెలిపాడు. ప్రభుత్వమే స్పందిస్తే దీక్షలు ఎందుకు చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు. గోదావరి  పుష్కరాల కోసం కోట్లు ఖర్చుచేసిన బాబు ప్రభుత్వం ఉద్దానం భాదితుల కోసం ఈ మాత్రం ఖర్చు చేయలేదా అని ఎద్దేవా చేశాడు.


అభివృద్ధి పేరుతో విదేశాలకు వెళ్లేందుకు సీఎం కు డబ్బులుంటాయి కానీ, పేదల ఆరోగ్యంపై ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవా అని బాబు విదేశీ పర్యటనలపై సెటైర్లు వేశాడు. టీడీపీ నాయకుల గురించి ప్రస్తావిస్తూ..ముందు కౌగిలించుకుని వెనుక వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిపిన పవన్, ఇలాంటి వారిని ఎలా నమ్మాలని వాఖ్యానించాడు. ఉద్దాన భాదితుల సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: