తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కేంద్ర నిఘా సంస్థ సిబిఐ గురిపెట్టింది. ఇందుకు గల కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని కేంద్రానికి కొన్ని జాతీయ నిఘా సంస్థల ద్వారా సమాచారం అందిందట. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతున్న అధికారి కార్యక్రమాలపై డేగకన్ను వేసిందంట. ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని తేలింది.
Image result for chandrababu
ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులు విచ్చలవిడి అవినీతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడుతున్నారని బట్టబయలయింది. ఇందుములంగాన్నే గత ఎన్నికలలో మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి జనసేన పార్టీలు రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అవినీతి అక్రమాల వల్లే టీడీపీతో తెగదెంపులు చేసుకున్నయి.
Image result for chandrababu
మరియు అదేవిధంగా గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని పలువురు కేంద్రం దృష్టికి తమ లేఖల ద్వారా తెలియజేశారట..దీంతో సీబీఐ నేరుగా ప్రభుత్వంపై దాడి చేయకుండా ముందుగా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతికి స‌హ‌క‌రించిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల‌ను మొద‌ట‌గా విచారించి, వారి నుంచి సాక్ష్యాధారాలు సేక‌రించిన త‌రువాత రెండో అడుగు వేయాల‌ని నిర్ణ‌యించింద‌ట సీబీఐ.
Related image
స‌ర్కార్‌పై నేరుగా కేసులు పెడితే ఆధారాలు తారుమార‌వుతాయ‌ని, అందుకే మొద‌ట అవినీతికి స‌హ‌క‌రించిన వారిని విచారించి, ఆ త‌రువాత స‌ర్కార్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సీబీఐ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్టు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకముందే చంద్రబాబుకి గట్టి దెబ్బే తగిలేటట్టు వుందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: