అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగు జాతిని అవమానంగా తక్కువగా చూస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ అతి తక్కువ నెలలలోనే అధికారం చేజిక్కించుకోవడం అప్పటి రాజకీయాలలో సంచలనం. అయితే తరువాత తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి...  ఎన్టీఆర్ కి అల్లుడు అయ్యాక కొన్ని రోజులకే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ అధినేత అయ్యాడు చంద్రబాబు.
Image result for chandrababu congress
ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం లబ్దికోసం అన్యాయంగా విభజించి ఆంధ్రరాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో వచ్చే 2019 ఎన్నికలలో జతకడతాకి  చంద్రబాబు గారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలతో చెట్టాపట్టాలు వేసుకుని మరి చంద్రబాబు ఫోటోలకు మీడియాలకు ఫోజులిచ్చారు.
Image result for chandrababu congress
అయితే ఈ పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. వీర్రాజు ఏమన్నారంటే చంద్రబాబు ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తున్నందునే ఆయన జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. మరో బీజేపీ నేత రాంమాధవ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ ఓటేసేవారు కనీసం 2 నుంచి 3 వేల మంది ఉంటారు.
Image result for chandrababu congress
వచ్చే ఎన్నికల్లో ఓవైపు జగన్ ను ఎదుర్కోవడమే కష్టమనుకుంటే.. పవన్ కూడా అడ్డం తిరగడంతో చంద్రబాబు ఒంటరిగా మారారు. ఈ దశలో వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం కూడా టీడీపీకి గెలుపు అవకాశాలు లేవు. ఈ నేపద్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రతిపక్షంలో నైనా కనీస బలంతో కూర్చోవాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: