వాహ‌న‌దారుల‌కు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. దేశ‌చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా పెట్రోలు, డీజ‌ల్ ధ‌ర‌లు త‌గ్గించ‌టంతో వాహ‌న‌దారులంద‌రూ దేశవ్యాప్తంగా పండ‌గ చేసుకుంటున్నారు. ఇంత‌కీ ఆయిల్ ధ‌ర‌లు ఎంత త‌గ్గాయ‌ని అనుకుంటున్నారు. ఒక్క‌టంటే ఒక్క పైసా త‌గ్గింది. నిజ్జంగానే నిజ‌మండి. గ‌డ‌చిన 16 రోజులుగా రూ. 15 పెంచిన ఆయిల్ ధ‌ర‌ల‌ను పెట్రోల్ కంపెనీలు తొలుత పెట్రోలుపై 60 పైసలు, డీజ‌ల్ పై 50 పైస‌లు త‌గ్గించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కానీ త‌గ్గింపుతో వాహ‌న‌దారుల‌కు మ‌రింత ఊర‌ట క‌లిగించాల‌నుకున్నాయో ఏమో ?  తొలుత చేసిన ఆలోచ‌నను స‌వ‌రించుకుని రెండింటింపై కేవలం ఒక్క‌పైసా మాత్ర‌మే త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా త‌గ్గించిన ధ‌రలు దేశ‌వ్యాప్తంగా త‌క్ష‌ణమే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించటంతో వాహ‌న‌దారులంద‌రూ సంబ‌రాలు చేసుకుంటున్న‌రు. 

Image result for petrol shock common peoples

చాలా కాలం త‌ర్వాత కేంద్ర‌ప్ర‌భుత్వానికి జ‌నాల మీద ద‌య‌  క‌లిగింది. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ధ‌ర‌లు త‌గ్గించ‌టమంటే మాట‌లా ?  పైగా దేశంలో ఎక్క‌డ కూడా ఎన్నిక‌లు లేవ‌న్న విష‌యం గ‌మ‌నించాలి. అయినా ఇంధ‌నం ధ‌ర‌లు త‌గ్గించ‌ట‌మంటే మామూలు విష‌యం కాదు.  మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో పెట్రోలు లీట‌ర్ ధ‌ర 83 రూపాయ‌లుంది. అటువంటిది ఒకేసారి  ఒక్క‌పైసా త‌గ్గ‌టంతో వాహ‌న‌దారులు పండ‌గ చేసుకుంటున్నారు. పెంచేది రూపాయ‌ల్లో, త‌గ్గించేది మాత్రం పైస‌ల్లో.  ఇదే విష‌య‌మై వాహ‌న‌దారులు మాట్లాడుతూ,  మ‌త్రం దానికే ధ‌ర‌లు త‌గ్గించిన‌ట్లు చ‌క్క‌లు కొట్టుకోవ‌టం ఎందురకో అర్ధం కావ‌టం లేద‌ని జ‌నాలు మండిపోతున్నారు.

Image result for petrol shock common peoples

మొద‌టి రూపాయి ధ‌ర త‌గ్గిస్తామ‌ని చెప్పిన కేంద్రం త‌ర్వాత మాత్రం పైస‌ల్లో త‌గ్గించింది. నిజానికి ఒక్క రూపాయి త‌గ్గించినంత మాత్రాన వాహ‌న‌దారుల‌కు ఒర‌గేదేమీ లేదు. చూడ‌బోతే జ‌నాలతో ఆయిల్ కంపెనీలు ఆడాడుకుంటున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. ఆయిల్ ధ‌ర‌ల మార్పులు త‌మ చేతిలో లేద‌ని కేంద్రం త‌ప్పించుకుంటోంది. ధ‌ర‌లు పెంచాల‌న్నా, త‌గ్గించాల‌న్నా ఆయిల్ కంపెనీల పేరు మీదే జ‌రుగుతోంది. అయితే. కంపెనీలు కూడా కేంద్ర‌ప్ర‌భుత్వంలో భాగ‌మే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 

Image result for indian oil

నిజానికి ఇంధ‌న ధ‌రలు పెర‌గ‌టం, త‌గ్గ‌ట‌మ‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం చేతిలో లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఇంధ‌న ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు అంత‌ర్జాతీయ ధ‌ర‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంత‌ర్జాతీయ స్ధాయిలో క్రూడాయిల్ బ్యార‌ల్ ధ‌ర త‌గ్గితే వివిధ‌ దేశాల్లో పెట్రోలు, డీజ‌ల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. అదే అంశం మ‌న దేశంలో కూడా అమ‌లు కావాలి. కానీ, ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్ లో జ‌రుగుతోంది. బ్యార‌ల్ క్రూడాయిల్ ధ‌రలు పెరిగితే వెంట‌నే దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెంచేసే కేంద్ర ప్ర‌భుత్వం క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గితే మాత్రం త‌గ్గించ‌టం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: