వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. పాద‌యాత్ర‌లో భాగంగా బుధ‌వారం  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా  న‌ర‌సాపురంలో యాత్ర చేస్తున్న జ‌గ‌న్ గురువారం పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు. నాలుగు రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు ప‌డుతున్నా లెక్క చేయ‌క పాద‌యాత్ర‌ను కొనసాగించిన ఫ‌లితంగానే ఈరోజు కాలు క‌ద‌ప‌లేని ప‌రిస్ధితికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం జ‌గ‌న్ కు వ‌డ దెబ్బ త‌గిలింది. దానికితోడు తీవ్ర జ్వ‌రం. వెంట‌నే స్దానిక నేత‌లు వైద్యుల‌ను పిలిపించారు.
Image result for jagan padayatra narasapuram
న‌డ‌వ‌లేని స్ధితికి చేరుకున్నారు
జ‌గ‌న్ ను ప‌రీక్షించిన వైద్యులు ఇన్ఫెక్ష‌న్ సోకిందిన కాబ‌ట్టి మూడు రోజుల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. అయితే, డాక్ట‌ర్లు ఎంత చెప్పినా విన‌కుండా జ‌గ‌న్ మ‌రుస‌టి రోజు య‌ధావిధిగానే పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టేశారు. అస‌లే, మండిపోతున్న ఎండ‌లు, దానికితోడు బ‌హిరంగ‌స‌భ‌లు, స‌మావేశాలు. ఇంకేముంది నీర‌స‌ప‌డిపోవ‌టంతో ఇన్పెక్ష‌న్ ఎక్కువైపోయింది. దాంతో కాలు క‌ద‌ప‌లేని ప‌రిస్ధితి. బుధ‌వారం రాత్రి పాద‌యాత్ర పూర్త‌యిన త‌ర్వాత శిబిరానికి చేరుకున్న జ‌గ‌న్ ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌లేని స్దితికి చేరుకున్నారు. దాంతో వైద్యులు సూచించిన‌ట్లు మందులు వాడ‌టం మొద‌లుపెట్టారు. 

Image result for jagan padayatra narasapuram ill health

డాక్ట‌ర్ల సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్ 
డాక్ట‌ర్లు చెప్పిన మాట విన‌కుండా మొండిగా పాద‌యాత్ర‌లో ముందుకెళితే భ‌విష్య‌త్తులో చాలా ఇబ్బందులు ప‌డాల్సొస్తుంద‌ని నేత‌లు కూడా గ‌ట్టిగా చెప్పటంతో చేసేది లేక జ‌గ‌న్ గురువారం పాద‌యాత్ర‌కు బ్రేక ప్ర‌క‌టించారు. గ‌తంలో అనంత‌పురం జిల్లా క‌దిరి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సంద‌ర్భంగా కూడా ఇదే ప‌రిస్దితి ఎదురైన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో కూడా వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని చెప్పినా విన‌లేదు.  

Image result for jagan padayatra narasapuram ill health

మరింత సమాచారం తెలుసుకోండి: