Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 10:23 am IST

Menu &Sections

Search

జెసిపై టిడిపి ఎంఎల్ఏల తిరుగుబాటు..చంద్ర‌బాబుకు షాక్

జెసిపై టిడిపి ఎంఎల్ఏల తిరుగుబాటు..చంద్ర‌బాబుకు షాక్
జెసిపై టిడిపి ఎంఎల్ఏల తిరుగుబాటు..చంద్ర‌బాబుకు షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అనంత‌పురం టిడిపిలో ముస‌లం త‌ప్ప‌దా ?  పోయిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రివ‌ర్స్ ఫ‌లితాలు త‌ప్ప‌వా?  జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అంద‌రిలోనూ అదే అనుమానం వ‌స్తోంది. అనంత‌పురం సిట్టింగ్ ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హార శైలే అందుకు ప్ర‌ధాన కార‌ణం. మామూలుగానే జెసితో ఎవ‌రికీ ఎక్కువ కాలం పొస‌గ‌దు. ఎందుకంటే, ఎక్క‌డుంటే అక్క‌డ ప్ర‌తీ విష‌యంలోనూ త‌న మాటే చెల్లుబాట‌వ్వాల‌నే మ‌న‌స్త‌త్వం ఉన్న జెసితో స‌హ‌జంగానే ఎవ‌రికీ ప‌డ‌దు. కాంగ్రెస్ పార్టీ మ‌హాస‌ముద్రం కాబ‌ట్టి స‌రిపోయింది. కానీ టిడిపి అలాకాదు. ఇపుడ‌దే పార్టీలో స‌మ‌స్య‌గా మారింది. కాక‌పోతే ఎన్నిక‌ల‌కు ముందు ఇటువంటి స‌మ‌స్య‌లు పెద్ద‌వైపోయి నేత‌లు రోడ్డున ప‌డుతుండ‌ట‌మే చంద్ర‌బాబునాయుడుకు పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. జెసి వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌ని ప‌లువురు నేత‌ల‌తో పాటు ముగ్గురు ఎంఎల్ఏలు కూడా తిరుగుబాటు లేవ‌దీస్తున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది.

anantapur-tdp-mp-jc-diwakar-reddy-mlas-revolt-chan

ఎక్కువైపోతున్న జెసి ఆధిపత్యం
ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, జిల్లాలోనే ఉన్న ముగ్గురు టిడిపి ఎంఎల్ఏల‌తో జెసికి ఏమాత్రం ప‌డ‌టం లేదు. పైన చెప్పుకున్న‌ట్లుగానే  జెసి ఆధిప‌త్యాన్ని వారు భ‌రించ‌లేకున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ ఏదోలా నెట్టుకొచ్చిన ఎంఎల్ఏలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా జెసి జోక్యం పెరిగిపోవ‌టాన్ని జీర్ణించుకోలేకున్నారు. అందుకే ఒక‌ర‌కంగా జెసిపై తిరుగుబాటు లేవ‌దీస్తున్నారు. జిల్లాలోని అనంత‌పురం, రాయ‌దుర్గం, శింగ‌న‌మ‌ల‌, క‌దిరి, గుంత‌క‌ల్లు, క‌ల్యాణ‌దుర్గం, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్యం కోసం జెసి ప్ర‌య‌త్నిస్తున్నారు. పై నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఎల్ఏల‌కు పోటీగా త‌న మ‌నుషుల‌ను దింపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇప్పించుకునేందుకు జెసి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్ట‌టంతో ఎంఎల్ఏలంద‌రూ పార్టీలో తిరుగుబాటు చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. దాంతో ఏమి చేయాలో చంద్ర‌బాబుకు దిక్కు తోచ‌టం లేదు. 

anantapur-tdp-mp-jc-diwakar-reddy-mlas-revolt-chan

అంద‌రినీ కెలికేస్తున్న జెసి

అనంత‌పురంలో సిట్టింగ్ ఎంఎల్ఏకి పోటీగా వైసిపిలో నుండి గుర్నాధ‌రెడ్డిని తెచ్చారు. గుంత‌క‌ల్లులో ఎంఎల్ఏ జితేంద్ర‌గౌడ్ కు పోటీగా మ‌ధుసూధ‌న‌గుప్తాను తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు నియోజ‌క‌వ‌ర్గం రాయ‌దుర్గంలో మేన‌ల్లుడు, ఎంఎల్సీ  దీప‌క్ రెడ్డిని తెచ్చారు. అలాగే, శింగ‌న‌మ‌ల, క‌ల్యాణ‌దుర్గం, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఎంఎల్ఏల‌కు పోటీగా నేత‌ల‌ను ప‌ట్టుకొచ్చారు. దాంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల అమ‌లులో ఎక్క‌డ చూసినా ఆయోమ‌యం నెల‌కొంది. పుట్ట‌ప‌ర్తి ఎంఎల్ఏ, మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డికి వ్య‌తిరేకంగా త‌న పిఏని దింపారు. దాంతో పై నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ‌ద్ర‌త చోటుచేసుకుంది. పోయిన ఎన్నిక‌ల్లో జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను టిడిపి 12 గెలుచుకున్న‌ది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఫిగ‌ర్ రివ‌ర్స్ అవుతుందేమో అన్న ఆందోళ‌ణ నేత‌ల్లో ఎక్కువైపోతోంది.

anantapur-tdp-mp-jc-diwakar-reddy-mlas-revolt-chan

రాజీనామాల‌తో హెచ్చ‌రిక‌లు
త‌మ‌కు పోటీగా త‌మ‌కు తెలీకుండా ఎవ‌రినైనా పార్టీలోకి చేర్చుకుంటే వెంట‌నే రాజీనామాలు చేస్తామంటూ అనంత‌పురం, గుంత‌క‌ల్లు ఎంఎల్ఏలు ప్ర‌భాక‌ర్ చౌద‌రి, జితేంద్ర గౌడ్ హెచ్చ‌రించారు. వీళ్ళ పంచాయితీ చివ‌ర‌కు చంద్ర‌బాబు ముందుకు చేరింది. అదే స‌మ‌యంలో కాల్వ కూడా జెసి పై సిఎంతో ఫిర్యాదు చేయ‌టంతో విష‌యం సీరియ‌స్ అయ్యింది. దాంతో జిల్లాలో అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ సీనియ‌ర్ నేత టిడి జ‌నార్ధ‌న్ ను  చంద్ర‌బాబు ఆదేశించారు. ప‌ద్ద‌తి మార్చుకునే వ్య‌క్తికాదు జెసి. జెసి ఆధిప‌త్యాన్ని భ‌రించ‌లేకున్నారు ఎంఎల్ఏలు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి దారుణ‌మైన ఫ‌లితాలు త‌ప్ప‌వ‌ని ద్వితీయ శ్రేణి నేత‌లు ఆందోళ‌న ప‌డుఉన్నారు.  చంద్ర‌బాబు ఈ పంచాయితీని ఏ విధంగా ప‌రిష్క‌రిస్తారో చూడాల్సిందే ?

anantapur-tdp-mp-jc-diwakar-reddy-mlas-revolt-chan

anantapur-tdp-mp-jc-diwakar-reddy-mlas-revolt-chan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్ ను  బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
షోకాజ్ నోటీసు ఇచ్చే స్ధాయి కాంగ్రెస్ లో ఎవ‌రికుంది ?
చింత‌మ‌నేనిపై అట్రాసిటీ కేసు
చ‌ద‌ల‌వాడ జంప్...చంద్ర‌బాబుకు షాక్
వెంక‌టగిరి నియోజ‌క‌వ‌ర్గం ఆనంకేనా ?
చంద్ర‌బాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్
ఎడిటోరియ‌ల్ : చంద్ర‌బాబు-మోడి మ‌ధ్య లోపాయికారీ ఒప్పంద‌ముందా ?
ఎడిటోరియ‌ల్ : ఊస‌ర‌వెల్లి కూడా సిగ్గుప‌డాల్సిందే
రేవంత్ రెడ్డికి ప్ర‌మోష‌న్...అడిగిందొక‌టి..ఇచ్చిందొక‌టి
జ‌గ‌న్ @ 3000 కిలోమీట‌ర్లు
ఎడిటోరియ‌ల్ :  టిడిపి ఓటు బ్యాంకులో చీలిక‌లు..ప్ర‌త్యామ్నాయ‌మేంటి ?
కాంగ్రెస్ లో కెసియార్ కోవ‌ర్టులా ?
చంద్ర‌బాబుకే షాకిచ్చిన ఎంఎల్ఏలు
ఎడిటోరియ‌ల్ :  జ‌గ‌న్ ది అదిరిపోయే స్ట్రాట‌జీ..వ‌ర్క‌వుట‌వుతుందా ?
 ఎడిటోరియ‌ల్ : గోదావ‌రి పుష్క‌రాల ప్ర‌మాదంలో చంద్ర‌బాబు త‌ప్పేలేద‌ట‌...నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు
తోక‌ముడిచిన చంద్ర‌బాబు
దేవినేని క‌నుస‌న్న‌ల్లోనే ఇసుక అక్ర‌మ ర‌వాణా ?
అమ‌రావ‌తిలో ఫుల్లుగా దోచేశారు...క‌డిగేసిన కాగ్
ఎడిటోరియ‌ల్ :  ఇండియా టుడే స‌ర్వేతో జ‌గ‌న్ కు వార్నింగ్ బెల్సేనా ?
సెంట్ర‌ల్ టిక్కెట్టు రాధాకు లేన‌ట్లే
టిడిపి ఎంఎల్ఏకి చిక్కులు
20 వేల పోస్టుల భ‌ర్తీ..ఎందుకో తెలుసా ?
ఉద్యోగ జేఏసి ఆందోళ‌న‌...అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త
వైజాగ్ లోక్ స‌భ‌కు నేదురుమ‌ల్లి ?
ఎడిటోరియ‌ల్ : గుంటూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను ఎందుకు మార్చేశారు ?
జ‌గ‌న్ హామీని  చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నారా ?
పోలీసుల‌ను హిజ్రాల‌తో  పోల్చిన జేసి
విజ‌య‌వాడ‌లో వైసిపికి షాక్ త‌ప్ప‌దా ?
రెచ్చిపోతున్న జేసి సోద‌రులు..పోలీసు వైఫ‌ల్య‌మేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.