తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. టీడీపీ శ్రేణులన్నీ ఒక పండగలా భావించే మహానాడు మొన్న మంగళవారంతో పూర్తయింది. 27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, వచ్చిన వారికి సరైన వసతులను కల్పించి ఈ మహానాడును విజయవంతం చేశారు. 


అయితే ఈ మహానాడులో  టీడీపీకి ఆ పార్టీ నేతలు, నాయకులు భారీగానే విరాళాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యధిక విరాళం సమర్పించి మహానాడు హీరో అయ్యారు.  25లక్షల రూపాయల చెక్‌ను పార్టీ కోసం శభాష్ అనిపించుకున్నారు. ఈయన గత ఎన్నికల ముందే పార్టీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. 


విరాళాల దాతల్లో రెండో స్థానంలో ఉన్నారు మంత్రి శిద్ధా రాఘవరావు మరియు టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు. వీరిద్దరూ చెరో  20లక్షల రూపాయల విరాళాన్ని పార్టీ కోసం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఎంపీ టీజీ వెంకటేష్ పది లక్షల రూపాయల విరాళాన్ని సమర్పించారట. మొత్తానికి ఈ మహానాడు వల్ల టీడీపీకి విరాళాల రూపంలో పది కోట్ల రూపాయల పై మొత్తమే వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: