వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కు రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు  చంద్రబాబు ప్రభుత్వంలో తాము అనుభవిస్తున్న బాధలు జననేత జగన్ కి చెప్పుకుంటున్నారు. జగన్ కూడా ప్రజాసమస్యలను వింటూ వారికి ధైర్యం చెబుతూ మంచిరోజులు వస్తాయని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది.
Image may contain: one or more people, crowd and outdoor
ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చంద్రబాబు విద్యార్థులను ఎలా మోసం చేశారో..జగన్ సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్యా అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రతి పేదవాడు చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇంజినీరింగ్ చదువులకు ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట విద్యార్థులకు ఇస్తున్న మొత్తం మాత్రం 35 వేలకు మించి లేదు. మిగిలిన 70 వేల రూపాయలను చెల్లించేందుకు పేద విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Image may contain: 9 people, people standing and outdoor
పిల్లలను ఎలా చదివించుకోవాలో పాలుపోక ఆస్తులను అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఆస్తులు కూడా లేక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్న తల్లిదండ్రుల ఇక్కట్లను చూసి.. వారి పిల్లలు మనోవేదనకు గురవుతున్నారు. బలహీన క్షణంలో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు చదివించాలని కూడా ఉన్న  ఆర్థిక ఇబ్బందులవల్ల పేదరికం వల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారు.
Image may contain: 1 person, smiling, text
దీంతో పెద్ద చదువులు చదవాలన్న కోరిక వేసుకుంటున్నారు... అయితే నేను అధికారంలోకి వస్తే మాత్రం.. చదువుకునే విద్యార్థి.. తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి వస్తే పూర్తి ఫీజు రీయింబర్సు మెంట్ పథకానికి శ్రీకారం చుడతాం. పిల్లల మెస్ ఖర్చులకు మరో 20 వేలు ఇవ్వడం ద్వారా వారికి మరింత భరోసా కల్పిస్తాం...అంటు విద్యార్థులకు అదిరిపోయే హామీలు ఇచ్చారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: