ఎవ‌రైనా త‌మ గురించి చెప్పుకోవాలంటే కాస్త ఎక్కువ  చెప్పుకోవ‌టం స‌హ‌జ‌మే. అటువంటి వాళ్ళు కూడా త‌మ గురించి అంతా తెలిసిన వాళ్ళ ద‌గ్గ‌ర మాత్రం నోరెత్త‌టానికి భ‌య‌ప‌డుతారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం అటువంటి వాటికి పూర్తిగా అతీత‌మ‌ని నిరూపించుకున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  చంద్ర‌న్న బీమా ప‌థ‌కం మూడేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా శుక్రవారం ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి దేశంలోని అంద‌రినీ మోసం చేస్తున్నార‌ట‌. తాను కూడా మోడి మాట‌ల‌కు మోస పోయిన‌ట్లు చెప్పారు. 

త‌ర్వాత మాట్లాడిన మాట‌లే అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాయి. మోడి మాట‌లు కోట‌లు దాటుతున్న‌ట్లు ఎద్దేవా చేశారు. ఎందుకంటే, మాట‌ల‌తో కోట‌లు క‌ట్ట‌టంలో చంద్ర‌బాబును మించిన‌వారు లేర‌న్న విష‌యం అందిరికీ తెలిసిందే. అటువంటిది ఈ విష‌యంలో త‌న‌క‌న్నా మోడినే గ్రేట్ అని చంద్ర‌బాబు ఒప్పుకోవ‌టం విశేష‌మే. నోట్ల ర‌ద్దు గురించి మాట్లాడుతూ, మ‌న డ‌బ్బులు మ‌నం తీసుకోవాలంటే కూడా క్యూలో నిల‌బ‌డేట్లు చేశారంటూ  మండిప‌డ్డారు. నిజానికి నోట్ల ర‌ద్దు చేయ‌మ‌ని మోడికి స‌ల‌హా ఇచ్చిన‌ట్లు చంద్ర‌బాబే ఒక‌పుడు చెప్పుకున్న విష‌యం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. 

ప్ర‌ధాన‌మంత్రి మైక్ తీసుకుంటే ఎప్ప‌టికీ వ‌ద‌లర‌ట‌. మోడిని ఎవ‌రూ ఆప‌లేర‌ని కూడా చంద్ర‌బాబు అన్నారు. నిజానికి ఈ ల‌క్ష‌ణం చంద్ర‌బాబులో కూడా ఎక్కువే. గంట‌ల కొద్దీ చెప్పిన విష‌యాల‌నే చెప్ప‌టం చంద్ర‌బాబు స్పెషాలిటీ. ఆ విష‌యాన్ని రాష్ట్రంలోని ఎవ‌రిని అడ‌గినా ఠ‌క్కున చెప్పేస్తారు. త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేస్తోంద‌న్నారు. తామేసిన రోడ్ల‌పై న‌డుస్తూ త‌న‌నే విమ‌ర్శిస్తున్నారంటూ మండిప‌డ్డారు. వేసిన రోడ్ల‌న్నీ అప్ప‌టికేదో త‌న జేబులో నుండి తీసి ఖ‌ర్చు పెడుతున్నంత బిల్డ‌ప్ ఇస్తున్నారు. కేంద్ర ప‌థ‌కాల‌ను త‌న ప‌థ‌కాలుగాను, వివిధ ప‌థకాల‌కు కేంద్రం ఇస్తున్న నిధుల విష‌యాన్ని మాట మాత్రం కూడా ప్ర‌స్తావించ‌కుండా అంతా త‌న‌వే అని, అంతా తానే చేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇవ్వ‌టంలో చంద్ర‌బాబును మించినోళ్ళులేరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: