ఈ  మధ్య కేసీఆర్ మీద చంద్ర బాబు విమర్శనా బాణాలు సంధిస్తున్నాడు. తాను చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి సెటైర్స్ వేసినాడు. అయితే ఓటుకు నోటు కేసు తరువాత కేసీఆర్ మరియు చంద్ర బాబు కు మధ్య సఖ్యత కుదిరింది. ఉన్న పళంగా హైదరాబాద్ నుంచి అమరావతీ కి బాబు గారు మఖం మార్చినారు. మరి వారి మధ్య ఏం రాజీ కుదిరిందో తెలియదు కానీ అప్పుడు బాగానే ఉన్నారు. మరలా ఇప్పుడు విమర్శలు చేసుకుంటున్నారు. 

Image result for chandra babu

వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంతోపాటు పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ బలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. 'అందరిలా నేను కుప్పి గంతులు వేయను.దాని పరిస్థితులు, పరిమితులు నాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్నాక.. ఇవి కేసీఆర్ ను ఉద్దేశించినవే అన్న అభిప్రాయం ఎవరికైనా కలగకమానదు.

Image result for chandra babu

దేశంలో అందరికంటే తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు.. కేసీఆర్ నేత్రుత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవడం రుచించడం లేదని తెలుస్తోంది. అందుకే సందర్భం వచ్చిన ప్రతీసారి ఏదో రకంగా దానిపై తీసికట్టు వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'చంద్రబాబు నాకు మంచి మిత్రుడే.. ఫ్రంట్ ఏర్పాటుపై ఆయనతోనూ మాట్లాడుతాం' అని కేసీఆర్ చెప్పిన కొద్దిరోజులకే ఆయన నుంచి దీనిపై ప్రతికూల స్పందన వచ్చింది. దీన్నిబట్టి కేసీఆర్ తో కలిసి నడవడానికి చంద్రబాబు ఏమాత్రం సుముఖంగా లేరని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: