టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద 1000 రూపాయలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపించ కుండా ఇలా కంటి తుడుపు చర్యలు ఎందుకు చేస్తుందని దుయ్య బడుతున్నారు. తెలుగుదేశంపార్టీ ఎన్నికల సమయం సమీపిస్తుండటం తో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది, అందులో భాగం గా నిరుద్యోగభృతి గా 1000 రూపాయలు ప్రకటించింది.

Image result for jobless

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిరుద్యోగభృతిపై సమాలోచనలు జరిపిన మంత్రులు నిరుద్యోగ భృతిపై విధివిధానాలు నిర్ణయించారు. చదువుకుని ఎటువంటి ఉపాధి లేని నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్‌ నిరుద్యోగ భృతి నిర్ణయంపై ప్రకటన చేశారు. భృతి తక్కువని అభిప్రాయం వస్తే రూ.1500కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Image result for jobless

యువతకు నిరుద్యోగ భృతి తోపాటు యువతకు ఉపాధినైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన తో రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు స్వల్ప ప్రయోజనం కలగనుంది. అయితే నిరుద్యోగ భృతి పై పలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి తో కలిగే ప్రయోజనం ఎంత అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. శాశ్వత పరిష్కారం దిశ గా అడుగులు వెయ్యాల్సిన చోట కంటి తుడుపు చర్యలాగా వెయ్యి రూపాయలు ఇవ్వటం ఏమి బాగోలేదని భావిస్తున్న వారు వున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: