జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఓక లెక్కతో ఉండి ఇప్పుడు స్వరం మార్చి తనకు అధికారం కట్టబెట్టండి మార్పును చూపిస్తా అంటున్నాడు. 2008 లో కూడా చిరంజీవి ఇవే మాటలు చెప్పి తీరా ఓడిపోయే సరికే పార్టీ ని నడపలేక కాంగ్రెస్ లో కలిపేసినాడు. అయితే ఈ  సారి అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. జనసేన అధినేత పవన్ సభకు జనాలు భారీగా వస్తున్నారు గాని ఎంత  మంది ఓట్లు వేస్తారో చెప్పలేము. 

Image result for janasena pawan kalyan

పవన్ బస్సుయాత్ర, పాదయాత్రలను మిక్స్ చేశారు. వెళ్లిన ప్రతీ ప్రాంతంలోనూ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ తాము ప్రజాసంక్షేమానికే పాటుపడతామని స్పష్టంచేస్తున్నారు. ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ తన యాత్ర తొలినాళ్లలోనే చెప్పారు. దీంతో ఆయన 2019 ఎన్నికలే టార్గెట్ గా ఇప్పట్నుంచే ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం ప్రారంభించేసినట్లు తేలింది.

Image result for janasena pawan kalyan

ఇదిలాఉంటే.. తాను పార్టీ పెట్టడానికి, ప్రజల్లోకి రావడానికి గల కారణాలనూ వివరిస్తున్నారు జనసేనాని. సామాజిక, రాజకీయ మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, తమ పార్టీతోనే కచ్ఛితమైన మార్పు వస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయ వ్యవస్థ కాకుండా సరికొత్త రాజకీయ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుదామని చెప్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: