2014 సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఆ ఎన్నికలలో పోటీ చెయ్యకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. అయితే గతంలో తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యానికి అధ్యక్షుడిగా ఉంటూ..కొంతవరకు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవడం..అలాగే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడంతో పవన్ కళ్యాణ్ మొత్తానికి రాజకీయంగా తన కుటుంబంతో చాలా దూరంగా ఉన్నాడు.
Related image
తర్వాత వచ్చిన ఎన్నికలలో జనసేన పార్టీని స్థాపించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా  ప్రముఖపాత్ర పోషిస్తూ ఉండటం జరిగింది. అయితే 2019 ఎన్నికలకు జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.
Related image
దీంతో పవన్ కళ్యాణ్ కుటుంబం నుండి చాలామంది పవన్ పార్టీకి మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు..మొన్న రామ్ చరణ్ తేజ్ మా బాబాయ్ ఆదేశిస్తే బాబాయ్ కోసం జనసేన పార్టీకి ప్రచారం చేస్తానని ప్రకటించాడు.
Image result for pawan sai dharam tej
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ రాజమండ్రిలో మాట్లాడుతూ తన మామయ్య పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే జనసేన తరుపున ప్రచారం చేయడానికి సిద్ధమని, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేస్తానని ఇందులో డౌట్ పడాల్సిన విషయం ఏది లేదని తన మనసులో మాట వ్యక్తం చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: