ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారిపోతున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న మార్పులు వైసిపికి అనుకూలంగా మారుతోందా అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లో వైసిపిలో చేరుతున్నార‌నే వార్త జిల్లాలో క‌ల‌ల‌కం రేపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవంతి భీమిలి అసెంబ్లీ నుండి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారానికి కార‌ణం భీమిలి వైసిపి నేత‌లే కావ‌టం గ‌మనార్హం. బీమిలీ నియోజ‌క‌వ‌ర్గం వైసిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వెంక‌ట‌రెడ్డి వాట్స‌ప్ లో పెట్టిన ఓ పోస్టు ఈ సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. వైసిపిలోకి రావాల‌నుకుంటున్న అవంతిని అంద‌రూ అడ్డుకోవాల‌ని వాట్స‌ప్ లో రెడ్డి ఇతర నేత‌ల‌కు సూచించారు. పార్టీ నేత‌ల మ‌ధ్య  క‌మ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసుకున్న వాట్స‌ప్ గ్రూపులోని మెసెజ్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చేసిందో అప్ప‌టి నుండే ఇటు వైసిపితో పాటు అటు టిడిపిలో కూడా సంచ‌ల‌నంగా మారింది. మెసెజ్ ను బ‌ట్టి అవంతి వైసిపిలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.
 Image result for avanthi srinivas mp
టిడిపిని ఎందుకు వ‌దిలేస్తున్నారు ?
ప్ర‌స్తుతం అవంతి ప‌రిస్ధితి టిడిపిలో బాగానే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టుకైతే ఢోకా లేదు. అయినా టిడిని ఎందుకు వ‌దిలేయాల‌ని అనుకుంటున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. ఒక‌వేళ టిడిపిని వ‌దిలేయాల్సిన  ప‌రిస్ధితితే వ‌స్తే అందుకు ప్ర‌త్యామ్నాయంగా ఇపుడు జ‌న‌సేన ఎటూ ఉండ‌నే ఉంది. ఎందుకంటే, అవంతికి  జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగా స‌న్నిహితుడు. 2009లో అవంతి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడు భీమిలి నుండే పోటీ చేసి ఎంఎల్ఏగా గెలిచింది ప్ర‌జారాజ్యం త‌ర‌పునే. త‌ర్వాత మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో పాటు 2014 ఎన్నిక‌ల్లో టిడిపిలోకి వ‌చ్చేశారు. జ‌న‌సేన ఉండ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపిలోకి ఎందుకు రావాల‌నుకుంటున్నారు ? అదికూడా ఎంపిగా కాద‌నుకుని తిరిగి భీమిలి అసెంబ్లీ స్ధానానికి ఎందుకు పోటీ చేయాల‌నుకుంటున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. 

Related image

టిడిపిపై వ్య‌తిరేక‌తే కార‌ణ‌మా ?
టిడిపిపై జ‌నాల్లో  వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చార‌మే అవంతి వైసిపిలోకి చేరాల‌నుకోవ‌టానికి కార‌ణ‌మా అన్న అనుమానాలు మొద‌లయ్యాయి. ఇక‌, జ‌న‌సేన అంటారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఎవ‌రిలోనూ లేదు. బిజెపి ప‌రిస్ధితి కూడా జ‌న‌సేన లాంటిదే. అందుక‌నే అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే  వైసిపిలో చేర‌టానికి ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌ని వైసిపి వ‌ర్గాలంటున్నాయి. మ‌రి, జ‌గ‌న్ చేర్చుకుంటారా లేదా అన్న‌ది మాత్రం తేల‌లేదు.  మొత్తం మీద అవంతి గ‌నుక వైసిపిలో చేరితే చంద్ర‌బాబునాయుడుకు పెద్ద షాక్ క్రిందే లెక్క‌. అదే స‌మ‌యంలో అవంతి చేరిక వ‌ల్ల వైసిపికి ఏమాత్రం లాభ‌ముంటుందో చూడాలి ?

Image result for avanthi srinivas mp

మరింత సమాచారం తెలుసుకోండి: