నెల్లూరు జిల్లాలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. గత ఎన్నికల్లో అంతంతమాత్రంగానే నెగ్గిన ఆ పార్టీ ఈసారి కూడా ఏమాత్రం పుంజుకున్నట్టు కనిపించడం లేదు. పైగా అందివచ్చిన అవకాశాలను వదిలేసుకుంటూ మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇప్పుడు టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలబోతోంది.

Image result for ANAM RAMANARAYANA REDDY

          నెల్లూరు, జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది. మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత కొంతమంది నేతలు టీడీపీలో చేరారు. వారిలో కొంతమందికి పదవులు ఆశజూపింది. దీంతో నేతలు సైకిలెక్కారు. అయితే ఎన్నేళ్లయినా వారి ఆశలు నెరవేర్చకపోవడంతో నేతలు అలకపాన్పు ఎక్కారు. దీంతో నేతలు మళ్లీ పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారమే ఇందుకు పెద్ద ఉదాహరణ.

Image result for ANAM RAMANARAYANA REDDY

          గత ఎన్నికల వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. సోదరుడు ఆనం వివేకానంద రెడ్డితో కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిని పార్టీలో చేర్చుకునేటప్పుడు ఎమ్మెల్సీ కట్టబెడ్తామని మాటిచ్చినట్టు సమాచారం. పార్టీలో చేరిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఆనం సోదరుల్లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ప్రతిసారి వీరిని బుజ్జగిస్తూ వస్తున్నారు. అయితే ఆనం వివేకానంద రెడ్డి మృతి ఆ కుటుంబలో తీరని విషాదం నింపింది. ఆయన చనిపోతూ సోదరులందరినీ కలిసుండాలని కోరినట్టు సమాచారం.

Image result for ANAM RAMANARAYANA REDDY

          దీంతో ఆనం రామనారాయణ రెడ్డి కూడా.. తన సోదరుల బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జయరామిరెడ్డి ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. టీడీపీలో ఇంతకాలం వెయిట్ చేసినా తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హైదరాబాద్ లో కుటుంబసభ్యులందరూ కూర్చుని ఈ మేరకు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒకట్రెండు రోజుల్లో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు  ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది.  అయితే టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరేందుకు కొంత సమయం తీసుకునే ఆలోచనలో ఆనం రామనారాయణ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులందరూ ఇకపై కలిసే ఉండాలని తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: